
అమరావతి, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2026) ఫలితాలు ఆదివారం (సెప్టెంబర్ 13) రాత్రి విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ టెట్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. అర్హత సాధించలేకపోయిన వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని సూచించారు. ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 16 వరకు 12 రోజుల పాటు ఏపీ టెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,97,703 మంది అభ్యర్థులు 2,18,254 పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 90,862 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 45.63 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు టెట్ కన్వీనర్ ఎం. వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.




