
చర్లపల్లి(హైదరాబాద్‌): చర్లపల్లిలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లాకు చెందిన డొక్కు రత్నరాజు(19), రాజేశ్‌(33), ప్రభాకర్‌(19) చర్లపల్లిలోని వెంకటేశ్వర పరిశ్రమలో సహాయకులుగా పనిచేస్తున్నారు. వారు ద్విచక్రవాహనంపై శనివారం అర్ధరాత్రి బీఎన్‌రెడ్డినగర్‌ నుంచి చర్లపల్లి చౌరస్తా వైపు వెళ్తున్నారు. ఈసీనగర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్దకు చేరుకోగానే.. ఎదురుగా అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ముగ్గురికి గాయాలు కాగా, అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. రత్నరాజు మృతి చెందగా.. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




