
కావలి: నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వాన పత్రికను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, పట్టణ ప్రముఖులు ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సత్కరించారు. ఈ నెల 20వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నూతన కార్యవర్గానికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ సేవలో, వ్యాపార రంగంలో ఆర్యవైశ్యుల పాత్ర ఎనలేనిదని, నిస్వార్థ సేవలతో సమాజ పురోగతికి తోడ్పడుతున్నారని కొనియాడారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





