
విశాఖపట్నం (మల్కాపురం): విశాఖ నగరంలోని 63వ వార్డు కాకరలోవ కూడలిలో ఆదివారం తెదేపా నేతలు మట్టి గణపతులను పంపిణీ చేశారు. తెదేపా సీనియర్‌ నాయకుడు గూడేల కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వార్డు మాజీ కార్పొరేటర్ గల్లా చిన్నా పాల్గొని మాట్లాడారు. రసాయనాలతో తయారీ చేసిన వినాయక విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీరని హాని కలుగుతోందన్నారు. వినాయక ఊరేగింపుల్లో పోలీసులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం మట్టి వినాయకులను, వినాయక విశిష్టతలను తెలిపే పుస్తకాలను దాదాపుగా 200మందికి పైగా భక్తులకు పంపిణీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





