
మందమర్రి పట్టణం: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో ప్రమాదం జరగింది. గనిలో మూడో సీమ్‌లో 14 లెవెల్ వద్ద ఎస్‌డీఎల్‌ యంత్రంతో ఆపరేటర్‌ శంకర్‌ పనిచేస్తుండగా ఒక్కసారిగా సైడ్ వాల్ కూలింది. దీంతో బొగ్గు పెల్లలు ఒక్కసారిగా యంత్రంపై పడుతుండటంతో గమనించిన శంకర్ అప్రమత్తమై వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న ఆయనను కార్మిక సంఘాల నేతలు పరామర్శించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





