
మండలంలోని మల్లాయిపల్లి గ్రామ ప్రజలకు శుద్ధి జలం అందించాలని, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవతో గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేయనున్న మినరల్ వాటర్ ప్లాంట్కు సోమవారం సర్పంచ్ నాగిరెడ్డి భూమిపూజ చేశారు.
© 2026 nimisham.in

మండలంలోని మల్లాయిపల్లి గ్రామ ప్రజలకు శుద్ధి జలం అందించాలని, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవతో గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేయనున్న మినరల్ వాటర్ ప్లాంట్కు సోమవారం సర్పంచ్ నాగిరెడ్డి భూమిపూజ చేశారు.
పాన్‌గల్: మండలంలోని మల్లాయిపల్లి గ్రామ ప్రజలకు శుద్ధి జలం అందించాలని, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవతో గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేయనున్న మినరల్ వాటర్ ప్లాంట్‌కు సోమవారం సర్పంచ్ నాగిరెడ్డి భూమిపూజ చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధి చేసిన తాగునీరు అందుతుందని తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎస్ఎఫ్‌డీ నుంచి రూ. 3.50లక్షలు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో షెడ్ నిర్మాణం, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్లాంట్‌కు అవసరమైన యంత్రాలను కమ్యూనిటీ వాటర్ ఫౌండేషన్ అందజేస్తున్నట్లు చెప్పారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాన్ని గుర్తించి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన మంత్రికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.






