
రామ్ చరణ్ పెద్ది సినిమా సమయంలో గాయపడటంతో మణికట్టుకి ఆపరేషన్ జరిగింది. దీంతో చాలా నెలలుగా చరణ్ చేతికి కట్టుతోనే కనిపించారు. తాజాగా చరణ్ తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్స్ తో దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. వీటిలో చరణ్ చేతికి కట్టు తీసేసి సింపుల్ బ్యాండేజ్, సపోర్టింగ్ బెల్ట్ తో మాత్రమే కనిపించారు. దీంతో చరణ్ రికవరీ అయినట్టేనా, త్వరగా నెక్స్ట్ సినిమా మొదలుపెడతాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.





