
బాలానగర్ : మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం చేశారు. బాలానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గుమ్మల వెంకటేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం పోరాడిన యోధుల సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, టీపీసీసీ సమన్వయకర్త దత్తాత్రేయ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




