
అక్కినేని అఖిల్(Akkineni Akhil) నటిస్తున్న తాజా సినిమా లెనిన్(Lenin) ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో కీలకంగా సాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల సినిమా ఫైనల్ వెర్షన్‌ను నాగార్జున(Nagarjuna)తో పాటు చిత్రయూనిట్ వీక్షించినట్లు సమాచారం. సినిమా మొత్తం ఆకట్టుకోవడంతో పాటు ముఖ్యంగా అఖిల్ యాక్టింగ్ కు ప్రశంసలు దక్కినట్లు తెలుస్తోంది. ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఉన్న క్లైమాక్స్ ఎపిసోడ్లో అఖిల్ తన కెరీర్లో ఇప్పటివరకు కనిపించని స్థాయి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
సినిమా క్వాలిటీని మరింత మెరుగుపర్చాలనే ఉద్దేశంతో నాగార్జున సూచించిన కొన్ని మార్పులను చిత్రబృందం అమలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని కీలక సీన్స్ ను రీషూట్ చేయడం ద్వారా కథనానికి మరింత బలం చేకూరేలా జాగ్రత్తలు తీసుకున్నారనే సమాచారం ఉంది. కమర్షియల్ అంశాలతో పాటు ఎమోషన్స్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చిన ఈ సినిమా అఖిల్‌కు కొత్త ఇమేజ్ తీసుకురావాలనే టార్గెట్ తో రూపొందినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తుండగా, అఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య వచ్చే ప్రేమకథ, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందించారని సమాచారం. వరుసగా సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్‌కు లెనిన్ అత్యంత కీలక సినిమాగా మారింది. ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొనడంతో, రిలీజ్ తర్వాత ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు మలుపు తిప్పే విజయాన్ని అందిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.