
గురు గ్రహం అధిపతిగా ఉన్న పునర్వసు నక్షత్రంలోకి బుధుడు సంచరిస్తున్నాడు. దీనివల్ల మేషరాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వారి జీవితంలో శాంతి, సంతోషం నెలకొని ఉంటుంది.
విదేశాలకు వెళ్లే అవకాశం కూడా వీరికి ఉంది. అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది.
బుధ సంచారం బల్లా తులా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. గురు గ్రహానికి సంబంధించిన పునర్వసు నక్షత్రంలో బుధుడు ఉండడం వల్ల వీరికి ఆర్థిక లాభాలు చేకూరతాయి. సమాజంలో వీరి హోదా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో వీరి అనుబంధం స్నేహపూర్వకంగా మారుతుంది.
పునర్వసు నక్షత్రంలోకి బుధుడు అడుగుపెట్టడం వల్ల కన్యా రాశి వారికి శుభవార్తలు అందుతాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
బుధుడు పునర్వసు నక్షత్రంలో సంచరించడం వల్ల మకర రాశి వారికి అనేక లాభాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న వేదనలకు ముగింపు వస్తుంది. పనికి తగిన ఫలితం కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి.