
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ (cricketer Shashank Singh), అతడి తండ్రి విశ్రాంత స్పెషల్ డీజీపీ శైలేష్ సింగ్‌పై కేసు నమోదయ్యింది.
తనను దూషించడంతోపాటు దాడి చేశారని ఆ ఇంట్లో పనిచేసే వంట మనిషి ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు భోపాల్ పోలీసులు వెల్లడించారు. శశాంక్ ఇంట్లో ఇటీవల తాను వంట మనిషిగా చేరానని విపేంద్ర సింగ్ తోమర్ తెలిపాడు. ఉచిత వసతి, భోజనం, నెలకు రూ.15,000 జీతంతో పాటు, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం పొందడంలో సాయం చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు చెప్పాడు.
అయితే.. వంటల్లో నాణ్యత లేదని శశాంక్, అతడి తండ్రి, మరో వ్యక్తి తనను దూషిస్తుండడంతో పని మానేయాలనుకున్నట్లు అతడు పేర్కొన్నాడు. వారు అందుకు అంగీకరించకుండా తనను తీవ్రంగా కొట్టారని.. తన మొబైల్ ఫోన్ సైతం లాక్కున్నారని ఆరోపించాడు. దీంతో ఆ వంట మనిషి పోలీసులను ఆశ్రయించాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: కుర్రాళ్లను అలా కూర్చోబెట్టాల్సిందేనా!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.