భృంగరాజ్ నూనె వాడటం ద్వారా అందులోని పోషకాలు జుట్టును బలంగా, ఒత్తుగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. దీనికోసం ఈ నూనెను కొద్దిగా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నపుడు తలకు రాసుకోండి.
గంటపాటు ఆగి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు సమస్యలు ఉండవని పీఎంసీ అధ్యయనం పేర్కొంది.
నువ్వుల నూనె కుదుళ్లకు బలం అందించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెను నేరుగా వాడటం లేదా ఉసిరి నూనెతో కలిపి వాడటం ద్వారా జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.
ఉసిరి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. దీనికోసం ఉసిరి నూనెకు తలకు రాసి బాగా మర్దన చేయండి. అరగంట సేపు ఉంచి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.
ఆముదం నూనెలో రిసినోలియాక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టును బలంగా, ఒత్తుగా మారుస్తాయి. దీనికోసం ఆముదం నూనెను తలకు రాసుకుని గంట తర్వాత క్లీన్ చేసుకుంటే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.
ఉల్లిపాయ నూనె కూడా జుట్టును బలంగా ఉంచి వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తుంది. దీనికోసం ఆముదం నూనెలో కొద్దిగా ఉల్లిపాయ నూనె కలిపి వేడి చేయండి. గోరువెచ్చగా ఉన్నపుడు తలకు రాసి కాసేపయ్యాక తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
రోజ్మేరీ ఆయిల్లోని పోషకాలు మీ కుదుళ్లకు బలం అందించి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. వెంట్రుకలు రాలడం నివారిస్తాయి. దీనికోసం కొద్దిగా బాదం లేదా కొబ్బరి నూనెలో ఈ రోజ్మేరీ ఆయిల్ కలిపి తలకు రాసుకోండి. గంట తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు.
ఆర్గాన్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం సమస్యను నివారిస్తాయి. దీనికోసం కొబ్బరి నూనె లేదా బాదం నూనెలో ఆర్గాన్ ఆయిల్ కలిపి తలకు అప్లై చేసుకోవచ్చు. గంట తర్వాత క్లీన్ చేసుకుంటే మంచిది.
జోజోబా ఆయిల్ కుదుళ్లలో సెబమ్ ఉత్పత్తి నియంత్రణలో ఉంచి జుట్టును హెల్తీగా మారుస్తుంది. దీనికోసం కొబ్బరి నూనెలో కొద్దిగా జోజోబా ఆయిల్ కలిపి తలకు రాసుకోండి. గంటపాటు ఉంచి షాంపూతో స్నానం చేస్తే సరిపోతుంది.
టీ ట్రీ ఆయిల్లోని యాంటీ మైక్రోబియల్ గుణాలు కుదుళ్లలో ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. చుండ్రును దూరం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. దీనికోసం ఏదైనా క్యారియర్ ఆయిల్ (కొబ్బరి నూనె, బాదం నూనె)లో ఈ ఆయిల్ కలిపి తలకు రాసుకోవచ్చు. కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.