
JetBlue airline | ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్ బ్లూ ఏయిర్‌లైన్స్ విమానాన్ని..
న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ విమానాశ్రయ సమీపంలో డ్రోన్ ఢీకొట్టింది. లాస్ వెగాస్ నుంచి వచ్చిన ఈ విమానం 3 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో 159 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
విమాన కాక్‌పిట్ వెలుపలి భాగాన్ని డ్రోన్ తాకిందని పైలట్ ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC)కు తెలిపాడు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని జెట్ బ్లూ ఏయిర్‌లైన్స్ వెల్లడించింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. విమానాశ్రయ పరిసరాల్లో ప్రతి నెలా దాదాపు 100 డ్రోన్లను గుర్తిస్తున్నామని.. నిషేధిత గగనతలంలో వీటిని ఎగరవేస్తే వారి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఏఏ హెచ్చరించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.