
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పూర్బ మేదినిపుర్ జిల్లాలోని హల్దియా పెట్రోకెమికల్ లిమిటెడ్ (Haldia refinery)కు చెందిన ఓ పైపులైన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
నాఫ్తా సరఫరాకు వాడే ఈ లైన్లో తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురిని తముల్క్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అగ్నికీలలు హల్దియా (Haldia)లోని చిరంజీబ్పుర్ 13వ వార్డులోని ఇళ్లనూ చుట్టుముట్టాయి. సమీపంలోని రైల్వేశాఖ పరికరాలు కూడా కాలి బూడిదయ్యాయి. 12 అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.