
బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్వీర్ కపూర్, సీతగా సాయి పల్లవిగా నటిస్తున్నారు.
బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్వీర్ కపూర్9ranbir kapoor), సీతగా సాయి పల్లవిగా (Sai pallavi) నటిస్తున్నారు. నమిత్ మల్హోత్ర నిర్మాతగా దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ పార్టు చిత్రీకరణ పూర్తయింది. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. రెండోపార్టు వచ్చే ఏడాది దీపావళికి ప్లాన్ చేశారు. ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాల్ ట్రెండ్ సృష్టించాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ అప్డేట్ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. జూలై 14న లాస్ ఏంజెల్స్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని, ఈ ట్రైలర్ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకునే భారీ వేడుకగా నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (Ramayana trailer)
అంతే కాదు ఈ సినిమా మర్చంటైజ్‌ను కూడా మొదలుపెట్టనున్నారు. ఇందులో రాముడి ధనుస్సు, హనుమంతుని గధ తో ఈ కార్యక్రమాన్ని షురూ చేయనున్నారట. రణబీర్ కపూర్, సాయి పల్లవి, సన్నీ డియోల్, రవి దూబే, యశ్ తదితరులు ఈ ఈవెంట్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. నితీశ్ దర్శకత్వంలో నమిత్ మల్హోత్ర ఈ చిత్రాన్ని ప్రతిషాత్మకంగా నిర్మిస్తున్నారు. భారతీయ ఇతిహాస గాథ ప్రపంచం మొత్తం తెలియాలనీ, ఈ సినిమాతో ప్రపంచ సినిమా ఇండియా వైపు చూడాలనే పట్టుదలతో నిర్మాత ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.