
ఫిల్మ్ ఇండస్ట్రీలో మాతృభాష రాని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఎందరో ఉన్నారు. ఈ విషయంలో టాలీవుడ్ కి మినహాయింపు ఏమీ లేదు. తెలుగులో స్టార్ డమ్ ఉన్న సగం హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదు.
అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున లాంటి చాలా మంది హీరోలకు తెలుగు చదవడం రాదు.
స్క్రిప్ట్ కూడా ఇంగ్లీష్ లో రాసుకుంటారు. ఈ హీరోలంతా ఇంగ్లీష్ మీడియం చదవడం.. చెన్నైలో పుట్టి పెరగడం వల్ల చాలా మంది సినిమా తారలకు మాతృభాష చదవడం, రాయడం రాదు. కానీ టాలీవుడ్ లో సహజనటిగా పేరు తెచ్చున్న పాత తరం హీరోయిన్ జయసుధకు కూడా తెలుగు చదవడం రాయడం రాదు అని మీకు తెలుసా?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సహజనటి అన్న పేరు జయసుధకు మాత్రమే ఉంది. నేచురల్ యాక్టింగ్ తో అద్భుతమైన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తోంది ఈ నటి. జయసుధ మూడు తారాల హీరోలతో కలిసి నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు, మురళీ మోహన్ వరకూ హీరోలతో జంటగా నటించిన జయసుధ.. ఆతరువాత తరం హీరోలకు తల్లిగా, భామ్మగా కూడా నటించి మెప్పించింది. విచిత్రం ఏంటంటే వందల తెలుగు సినిమాలు చేసిన జయసుధకు తెలుగు చదవడం, రాయడం రాదు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించింది.
జయసుధ తెలుగు నటి, కృష్ణ సతీమణి విజయ నిర్మలకు చాలా దగ్గర బంధువు. ఆమె అవ్వడానినికి తెలుగు నటే అయినా.. చెన్నైలోనే ఉంటుంది... మద్రాస్ లోనే పుట్టి పెరిగింది. అక్కడే తమిళ , ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది. దాంతో ఆమెకు తమిళం రాయడం, చదవడం వచ్చు. తెలుగు సినిమాలు చేసినా కూడా తెలుగు చదవడం ఆమెకు రాదు. డైలాగ్స్ విని వాటిని గుర్తు పెట్టుకుని యాక్ట్ చేయడం జయసుధకు మొదటి నుంచి అలవాటు.
తెలుగు రాయడానికి చాలా ప్రయత్నం చేసినట్టు జయసుధ వెల్లడించారు. ఎంత ప్రయత్నించినా రాయలేకపోయానని ఆమె అన్నారు. తెలుగు భాష చాలా సుందరమైనదని.. తమిళ కవి భరతీయార్ కూడా సుందర తెలుంగు అని మెచ్చుకున్నట్టు గుర్తు చేసుకున్నారు. నటుడు వివేక్ మాత్రం తెలుగు అక్షరాలు చూస్తుంటే జీలేబీలు గుర్తుకు వస్తాయని అంటుంటాడని, తనకు కూడా తెలుగు అక్షరాలు జీలేబీల మాదిరి అనిపిస్తాయని ఆమె అన్నారు. తమిళంలో 18 అక్షరాలే ఉండటం వల్ల త్వరగా నేర్చుకోగలిగానని జయసుధ అన్నారు.
ఒకప్పుడు సౌత్ సినిమా అంతా చెన్నైగా చెప్పబడుతున్న మద్రాసులో ఉండేది. ఆ కాలం నటులంతా అక్కడి నుంచే తమ భాషా సినిమాల్లో నటించేవారు. కాలక్రమంలో తెలుగు రాష్ట్రం విడిపోవడం.. తెలుగుఇండస్ట్రీ హైదరాబాద్ కు , కన్నడ పరిశ్రమ బెంగళూర్ కు చేరింది. అయితే సరే చాలామంది ఆతరం నటీనటులు చెన్నైలోనే అలవాటు పడటంతో అక్కడే ఉండిపోయారు. జయసుధ, జయప్రద, ఎస్పీబీ, డబ్బింగ్ జానకి, సింగీతం శ్రీనివాసరావు, షావుకారు జానకి, ఇలా ఎంతో మంది ఆ తరం వారు అక్కడే ఉండిపోయారు. కొంతమంది మాత్రం హైదరాబాద్ కు షిప్ట్ అయ్యారు.