
ఇంట్లో ఆడపిల్లలు పట్టీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే వచ్చే అందమే వేరు. ముఖ్యంగా మువ్వల పట్టీలు చేసే శబ్దం మరింత బాగుంటుంది.
అలాంటి కొన్ని డిజైన్లు చూద్దాం…
ఈ రోజుల్లో మార్కెట్లో తక్కువ బరువున్న మువ్వల డిజైన్లు కూడా దొరుకుతున్నాయి. చిన్న పిల్లలకు ఇలాంటి ఫ్యాన్సీ ఫుల్ సిల్వర్ బీడ్స్ పట్టీలు చాలా సేఫ్, సౌకర్యవంతంగా ఉంటాయి.
నామకరణం లేదా పండగల కోసం మువ్వల వెండి పట్టీలను ఎప్పుడూ ఇష్టపడతారు. నడుస్తున్నప్పుడు చిన్న చిన్న మువ్వలు చేసే సవ్వడి ఈ డిజైన్‌కు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత.
పాపాయి కోసం ట్రెండీ, క్యూట్ డిజైన్ కావాలంటే ఇది ట్రై చేయండి. ఇలాంటి క్యూట్ ఛార్మ్ సిల్వర్ పట్టీలు అద్భుతమైన ఆప్షన్. చిన్న చిన్న ఛార్మ్స్ పట్టీలకు స్టైలిష్ లుక్ ఇస్తాయి.
ఈ నల్ల పూసల అడ్జస్టబుల్ పట్టీల డిజైన్ తక్కువ బడ్జెట్లోనే సులభంగా దొరుకుతుంది. దీన్ని గిఫ్ట్‌గా ఇవ్వడానికి తప్పకుండా ఎంచుకోవచ్చు.దిష్టి తగలకుండా ఉంటాయి. అందంగా కూడా ఉంటాయి.
నల్ల ముత్యాలతో చిన్న సిల్వర్ స్టోన్ కాంబినేషన్ ఎప్పుడూ క్లాసీగా కనిపిస్తుంది. ఈ డిజైన్ పిల్లల పాదాలకు చాలా అందంగాఉంటుంది. ఇది ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
ఈ హెవీ కడియం సిల్వర్ పట్టీల డిజైన్ రోజూ వేసుకోవడానికి చాలా రాయల్ లుక్‌ను ఇస్తుంది. పిల్లల చర్మంపై బరువుగా అనిపించదు. దీన్ని కొనడానికి మాత్రం కొంచెం బడ్జెట్ ఎక్కువ కావాలి.
చిన్న పిల్లల కోసం తేలికైన, సౌకర్యవంతమైన పట్టీలు కొనాలనుకుంటే, మినిమల్ బీడ్స్ సిల్వర్ పట్టీలు బెస్ట్ ఆప్షన్. సన్నని వెండి గొలుసుతో చిన్న పూసలు చాలా అందంగా కనిపిస్తాయి.
Sweet Potato : టెర్రస్‌పై చిలగడదుంప సాగు.. అదీ ఆర్గానిక్ పద్దతిలో
Gas Safety: గ్యాస్ స్టవ్ దగ్గర ఇవి అస్సలు పెట్టొద్దు.. జాగ్రత్త సుమా!
Pendant Designs:లైట్ వెయిట్ మంగళసూత్రాలకు సూటయ్యే పెండెంట్స్
Jaggery Storage: బెల్లం బూజు పడుతోందా? ఇలా చేస్తే ఏడాదైనా పాడవ్వదు