
మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టులో ఎవరికీ అన్యాయం జరగనీయబోమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ, పునరావాసం అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి...
మానవీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకుని భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని సూచించారు. భూములు కోల్పోయే రైతులకు తగిన పరిహారం, పునరావాసం అందించాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరం మరింత అందంగా మారాలని, విస్తృతంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.