
యాక్షన్ ఎంటర్టైనర్ కిల్ చిత్రంలో విలన్‌గా మెప్పించిన నటుడు రాఘవ్ జుయల్(Raghav Juyal). ప్రస్తుతం నాని నటిస్తున్న ది పారడైజ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాఘవ్ జుయల్ త్వరలోనే ఒక ఇంటివాడు...
యాక్షన్ ఎంటర్టైనర్ కిల్ చిత్రంలో విలన్‌గా మెప్పించిన నటుడు రాఘవ్ జుయల్(Raghav Juyal). ప్రస్తుతం నాని నటిస్తున్న ది పారడైజ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాఘవ్ జుయల్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి.
యాక్షన్ ఎంటర్టైనర్ కిల్ చిత్రంలో విలన్‌గా మెప్పించిన నటుడు రాఘవ్ జుయల్(Raghav Juyal). ప్రస్తుతం నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాఘవ్ జుయల్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా రాఘవ్.. ప్రముఖ గ్లోబల్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్, నటి నిహారిక ఎన్ ఏం (Niharika NM)తో రిలేషన్ లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరిని ఒకరు హగ్ చేసుకొని ఎంతో క్లోజ్‌గా, రొమాంటిక్‌గా దిగిన ఫోటోలకు ఒక రెడ్ హార్ట్, ఈవిల్ ఐ, స్టార్ ఎమోజీలను క్యాప్షన్‌గా జోడించి పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారంటూ నెటిజన్స్ కంగ్రాట్స్ చెప్పుకొస్తున్నారు.
అయితే.. ఇదంతా నిజం కాదని, ఇది కేవలం ప్రమోషన్ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం లండన్ నేపథ్యంలో వివేక్ బి. అగర్వాల్ దర్శకత్వంలో రూపొందుతున్న భాయ్ తేరా స్టార్ హై అనే హిందీ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. దాని ప్రమోషన్ కోసమే ఈ జంట ఇలా కలిసి కనిపించారని అంటున్నారు. ఇంకొందరు.. రాఘవ్ వెనుక నుంచి నిహారికను ఆప్యాయంగా హగ్ చేసుకొని ఉండగా, ఇద్దరి ముఖాల్లోనూ లవ్ బ్లష్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పోస్ట్‌పై ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచ్లానీ, ర్యాపర్ రఫ్తార్ వంటి పలువురు సెలబ్రిటీలు లవ్ ఎమోజీలతో కామెంట్లు చేయడంతో ఫ్యాన్స్ దాదాపు ఇది నిజమైన ప్రేమేనని ఫిక్స్ అయిపోతున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఈ క్రేజీ జోడీ షేర్ చేసిన రొమాంటిక్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లు, ఫ్యాన్స్ వీరిద్దరి కెమిస్ట్రీ బావుందని తెగ మెచ్చుకుంటూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతేడాది మిత్రమండలి సినిమాతో ఆమె తెలుగుకు పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన ఫలితం అందించలేకపోయినా.. అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తమిళ్ లో పెరుసు సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న నిహారిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.