
టింగ్హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం ఇది నాలుగోసారి మాత్రమే కావడం విశేషం. మరోవైపు, ఇంగ్లండ్‌కు గత 9 టెస్టుల్లో ఇది ఏడో ఓటమి కాగా.. 2012 తర్వాత సొంతగడ్డపై 3 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌటైంది. కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్(151), డెవాన్ కాన్వే(157) భారీ సెంచరీలతో చెలరేగారు. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా న్యూజిలాండ్‌కు 84 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కాస్త తడబడింది. ఒక దశలో తక్కువ స్కోరుకే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. . కానీ, డారిల్ మిచెల్ ఒంటరి పోరాటం చేస్తూ అద్భుతమైన అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌ను 288/9 వద్ద డిక్లేర్ చేసింది. 373 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 212 పరుగులకే కుప్పకూలింది.
మూడో టెస్ట్ నాల్గో రోజు ఆట సందర్భంగా 35 ఏళ్ల స్టోక్స్ హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తూ అందరినీ షాక్‌కు గురిచేశారు. గత నాలుగేళ్లుగా కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని, మానసికంగా, శారీరకంగా అలసిపోవడం అవ్వడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే కౌంటీ క్రికెట్లో డర్హామ్ జట్టు తరఫున ఆడతానని వెల్లడించారు. తన చివరి మ్యాచ్‌లో అభిమానులను అలరించడానికి స్టోక్స్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 20 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కివీస్ ఆటగాళ్లు ఆయనకు 'గార్డ్ ఆఫ్ హానర్' ఇచ్చి గౌరవించారు.
ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రియాద్ మహ్రెజ్ వ్యాఖ్యలతో వివాదం!
అక్కడ '24 క్యారెట్' పిచ్‌లు అంతర్జాతీయ క్రికెట్లో ఉండవు: అశ్విన్