
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్‌కు తెరతీసింది.
కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా ఓటీటీ స్ట్రాటజీలో కూడా ఈ సినిమా ఒక సంచలనం రేపుతోంది.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. ఇలాంటి టైమ్‌లో రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన చిత్రం ‘పెద్ది’ (Peddi). పక్కా లోకల్ కథలతో సెన్సేషన్ క్రియేట్ చేసే బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్‌కు తెరతీసింది. అయితే కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా ఓటీటీ స్ట్రాటజీలో కూడా ఈ సినిమా ఒక సంచలనం రేపుతోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ తన నట విశ్వరూపం చూపించాడు. కేవలం ఒకే రకమైన పాత్రకు పరిమితం కాకుండా.. క్రికెట్ మైదానంలో సిక్సర్లు బాదే ఆటగాడిగా, మట్టి కుస్తీలో సత్తా చాటే పహిల్వాన్ గా, ఆ తర్వాత గాలిని సైతం వెనక్కి నెట్టే రన్నర్‌గా అద్భుతమైన వేరియేషన్స్ చూపించాడు. ప్రతి ఆటలోనూ చరణ్ చూపించిన ఇంటెన్సిటీకి థియేటర్లలో అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. కంటెంట్‌లో దమ్ముంటే వసూళ్లు ఎలా ఉంటాయో నిరూపిస్తూ.. ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఈ చిత్రం నిర్మాతలను సేఫ్ జోన్లో నిలబెట్టింది. రిలీజ్ అయిన తొలి వీకెండ్ లోనే కాకుండా.. వరుసగా వర్కింగ్ డేస్‌లో కూడా థియేటర్స్ వద్ద ప్రేక్షకుల సందడి కనిపించింది. సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సరే.. విడుదలైన నాలుగు వారాలకు అంటే 28 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ లెక్కన ‘పెద్ది’ సినిమా జులై 2వ తేదీ నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి రావాల్సి ఉంది. ఓటీటీ ఆడియన్స్ కూడా ఈ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, మేకర్స్ ఇక్కడే ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. ఎవరూ ఊహించని విధంగా 4 వారాల డీల్ కాకుండా, ఓటీటీ స్ట్రీమింగ్ (Peddi OTT Streaming)కు ఏకంగా 42 రోజుల గడువు తీసుకున్నారు.
నిర్మాతలు ముందుచూపుతో తీసుకున్న ఈ 42 రోజుల నిర్ణయం సినిమాకు బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఎలాగూ నెల రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని థియేటర్లకు వెళ్లడానికి బద్ధకించే ప్రేక్షకులు.. ఈ సినిమా ఇప్పట్లో రాదని ఫిక్స్ అయిపోయారు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువత అంతా థియేటర్ల వైపు క్యూ కట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ వీక్‌తో పాటు సెకండ్, థర్డ్ వీక్‌లో కూడా స్టడీగా కలెక్షన్లు రావడానికి ఈ వ్యూహమే ప్రధాన కారణం. రీసెంట్ వీకెండ్లో కూడా ‘పెద్ది’ సినిమాకు ఒక మోస్తర్ కలెక్షన్స్‌నే సాధించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని చాలా సినిమాలకు 4 వారాల ఓటీటీ అగ్రిమెంట్ మాత్రమే నడుస్తోంది. కానీ, బాలీవుడ్లో అలా కాదు.. అక్కడ దాదాపుగా 8 వారాల టైమ్ లైన్ అమల్లో ఉంది. సినిమా థియేటర్లలో రన్ అయ్యే సమయం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌గా ఉంటున్నారు. ఇప్పుడు 'పెద్ది' చిత్రబృందం కూడా దాదాపు అదే రూల్‌ను ఫాలో అవ్వడం విశేషం. మిగతా టాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ ఎనిమిది వారాల ఫార్ములాను పాటిస్తే, థియేట్రికల్ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇలా లాంగ్ రన్ ఉండటం వల్ల అటు నిర్మాతలతో పాటు ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతా లాభాల బాట పడతారు. ఇక పెద్ది జులై 16న నెట్‌ఫ్లిక్స్‌లో సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ వెర్షన్ మాత్రం 8 వారాల తర్వాత అంటే జూలై 30న స్ట్రీమింగ్ కానుంది.
డెలివరీ బాయ్‌ని కొట్టిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో.. వీడియో వైరల్
‘విశ్వంభర’ సెన్సేషనల్ అప్డేట్.. ఇక విడుదలే!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్.. పోస్టర్ అదిరిపోయిందిగా!