
సోషల్ మీడియాలో ఒక డెలివరీ బాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో నటించిన హీరో అఖిల్ రాజ్, ఒక డెలివరీ బాయ్ పై భౌతిక దాడికి దిగడం ఈ...
సోషల్ మీడియాలో ఒక డెలివరీ బాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో నటించిన హీరో అఖిల్ రాజ్, ఒక డెలివరీ బాయ్ పై భౌతిక దాడికి దిగడం ఈ వీడియోలో తీవ్ర కలకలం రేపుతోంది.
సోషల్ మీడియాలో ఒక డెలివరీ బాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) చిత్రంలో నటించిన హీరో అఖిల్ రాజ్ (Akhil Raj), ఒక డెలివరీ బాయ్ (Delivery Boy)పై భౌతిక దాడికి దిగడం ఈ వీడియోలో తీవ్ర కలకలం రేపుతోంది. రాంగ్ అడ్రస్‌కు పార్సిల్ తీసుకువచ్చాడనే నెపంతో సదరు హీరో, అతని కుటుంబ సభ్యులు డెలివరీ బాయ్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ డెలివరీ బాయ్ వీడియోలో తెలియజేస్తున్నాడు. వీడియోలో ఉన్న విజువల్స్ కూడా అదే తెలియజేస్తున్నాయి.
ఈ వీడియోలో డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. తానేదో పొరపాటున రాంగ్ అడ్రస్‌కు ఆర్డర్ తీసుకువచ్చినందుకు క్షమాపణలు చెప్పినప్పటికీ, సదరు హీరో అతని కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని పేర్కొన్నాడు. బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకు వస్తున్న సమయంలో సదరు హీరో డెలివరీ బాయ్ వైపు దూసుకురావడం, అతనిని కొట్టడానికి ప్రయత్నించడం మొత్తం ఆ డెలివరీ బాయే రికార్డ్ చేస్తుండటం విశేషం. అక్కడ ఉన్న మహిళలు, ఇతర వ్యక్తులు వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ హీరో మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నట్లుగా ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది.
అంతేకాకుండా.. హీరో తల్లి తన ముఖంపై ఉమ్మివేసిందని, తనను తీవ్రంగా అవమానించారని సదరు డెలివరీ బాయ్ వీడియో తీస్తూ ఇందులో మొరపెట్టుకుంటున్నాడు. ‘‘నేను సారీ చెప్పినా కూడా నన్ను కొట్టడానికి ఎలా వస్తారు?’’ అంటూ అతను ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, సదరు హీరో ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాన్య డెలివరీ బాయ్‌పై ఇలాంటి దౌర్జన్యానికి దిగడం సరికాదంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే హీరో సైడ్ వాదన ఏంటనేది మాత్రం ఇక్కడ తెలియాల్సి ఉంది. కేవలం డెలివరీ బాయ్ సైడ్ మాత్రమే ఈ వీడియో కనిపిస్తోంది. అసలక్కడ ఏం జరిగిందనేది మాత్రం.. హీరో అండ్ ఫ్యామిలీ రియాక్ట్ అయితేగానీ తెలియదు.
‘విశ్వంభర’ సెన్సేషనల్ అప్డేట్.. ఇక విడుదలే!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్.. పోస్టర్ అదిరిపోయిందిగా!
క్రేజీ అప్డేట్.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో సూర్య.. ‘జై భీమ్’ కాంబో రిపీట్!