
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల విడుదలైన కరుప్పు(Karuppu) చిత్రంతో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన సూర్య ఈ భారీ సక్సెస్ అంది
ంచిన ఊపుతో బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల విడుదలైన కరుప్పు(Karuppu) చిత్రంతో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన సూర్య ఈ భారీ సక్సెస్ అందించిన ఊపుతో బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ కి సిద్ధమవ్వగా తాజాగా తన 48వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాతో కేజీఎఫ్, కాంతార వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లోకి మొదటిసారి సూర్య అడుగుపెడుతున్నాడు సూర్య. ఇక ఈ చిత్రానికి టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జై భీమ్ లాంటి హిట్ సినిమా వచ్చింది. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇక ఈ సినిమాలో సూర్య సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది హాట్ బ్యూటీ కయాదు లోహర్. ప్రదీప్ రంగనాథన్ సరసన డ్రాగన్ సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ భామ తెలుగులో అల్లూరి తరువాత ఫంకీ సినిమాతో మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా అమ్మడికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం అమ్మడి చూపు అంతా నాని ప్యారడైజ్ సినిమాపైనే పెట్టింది. ఈ సినిమాలో నాని సరసన నటిస్తోన్న ఈ చిన్నది తాజాగా సూర్య సరసన రొమాన్స్ చేసే మరో లక్కీ ఛాన్స్ పట్టేసింది.
కెరీర్ ఆరంభంలోనే సూర్య వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ రావడం కయాదు లోహర్ కి ఒక బిగ్గెస్ట్ బ్రేక్ అనే చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ప్యారడైజ్ కనుక హిట్ అయితే అమ్మడిని అందుకోవడం చాలా కష్టమని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ గా కయాదు లోహర్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. అందులో టి.జె. జ్ఞానవేల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమాలతో ఈ భామ ఎలాంటి విజయాలను దక్కించుకోనుందో చూడాలి.