
ఒకప్పుడు కొత్త కారు కొనేటప్పుడు మైలేజ్, ధరకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకుని, చాలామంది
5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లనే ఎంచుకుంటున్నారు. మంచి విషయం ఏంటంటే ఇప్పుడు తక్కువ ధర కార్లలో కూడా ఇలాంటి సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇక రూ.5.65 లక్షల ప్రారంభ ధరతో లభించే నిస్సాన్ మాగ్నైట్ భద్రత విషయంలో గ్లోబల్ NCAP 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. నిస్సాన్ వెహికిల్స్ లో బలమైన బాడీ నిర్మాణం, ట్రాక్షన్ కంట్రోల్, వెహికిల్ డైనమిక్ కంట్రోల్, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి భద్రతా ఫీచర్లు ఉంటారు. అంతేకాదు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి టెక్నాలజీ ఫీచర్లు కలిగివుంటాయి.
ఇక టాటా ఆల్ట్రోజ్ కూడా తక్కువ ధరలో మంచి సెప్టీ ఫీచర్లు కలిగిన కారు. దీని ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షలు మాత్రమే… కానీ ఇది ఇండియా NCAPలో 5-స్టార్ రేటింగ్ పొందింది. అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల వంటి ఫీచర్లు అందిస్తోంది. దీంతో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులను ఈ కారు ఆకర్షిస్తుంది.