
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram pothineni) తన కెరీర్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న రామ్, ఇప్పుడు డైరెక్టర్ గానూ ప్రేక్షకులను అలరించేందుకు...
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram pothineni) తన కెరీర్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న రామ్, ఇప్పుడు డైరెక్టర్ గానూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. #RAPO23 పేరుతో రూపొందనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకు రామ్ స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జూన్ 29న ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అనౌన్స్మెంట్ పోస్టర్‌తోనే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారిక ప్రారంభానికి సిద్ధమవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
రాపో సినిమాటిక్స్(Rapo Cinematics) బ్యానర్‌పై కృష్ణ చైతన్య పొతినేని(Krishna Chaitanya Pothineni) నిర్మిస్తున్న ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. విజువల్స్‌ను నేషనల్ అవార్డ్ సినిమాటోగ్రాఫర్ తిరు(Thiru) అందించనుండగా, యాక్షన్ ఎపిసోడ్స్‌ను ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ డిజైన్ చేయనున్నారు. ఇక ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్(AS Prakash) ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలో భారీ సెట్లు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నట్లు సమాచారం. టెక్నికల్ గా అత్యున్నత ప్రమాణాలతో సినిమాను రూపొందించే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
పూజా కార్యక్రమంతో ఈ భారీ ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కనుండగా, వెంటనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రామ్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో పాటూ ఆ సినిమాలో అతనే హీరోగా నటించనుండటం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. కథ, నటీనటులు, ఇతర సాంకేతిక విభాగాలకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా రామ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనే అంచనాలు ఇప్పటికే సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.