
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate: పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో విదేశీ మారకపు నిల్వలను కాపాడుకునేందుకు ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ప్రధాని మోదీ పిలుపు తర్వాత బంగారం ధరలు తగ్గాయా. ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గించారా. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మే 10, 2026న తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో సంవత్సరం పాటు బంగారం కొనగోలు చేయవద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ తర్వాత దిగుమతి సుంకాన్ని 15శాతం వరకు పెంచింది. ఈ చర్యతో దేశీయంగా బంగారం, వెండి డిమాండ్ గణనీయంగా తగ్గింది. అయితే ప్రధాని పిలుపు తర్వాత దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు నిజంగానే తగ్గాయా. ఏ మేరకు తగ్గాయి.. పెరిగాయో చూద్దాం.
ప్రధాని మోదీ పిలుపుతో దేశీయ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు భారీగానే తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. దిగుమతి సుంకాలు పెంచడం కూడా కొనుగోళ్లు తగ్గడానికి ఓ కారణమని చెప్పాలి. మే 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు ధరలను చూస్తే.. 10 గ్రాముల బంగారం ధర రూ. 13000 పైన దిగివచ్చింది. కిలో వెండి ధర చూస్తే 46వేలు తగ్గింది. మే 10, 2026 రోజున ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,53,150 వద్ద ఉంది. కిలో వెండి ధర చూస్తే రూ. 2,62,350 వద్ద ఉంది. జూన్ 28, 2026 ఆదివారం నాడు ఇండియన్ బులియన్ అసోసియేషన్ డేటా చూసుకున్నట్లయితే 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39, 873కు దిగివచ్చింది. కిలో వెండి ధర రూ. 2,16,541 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని ప్రకారం 10గ్రాముల బంగారం ధర 13,267 , వెండి ధర 45,809 వరకు తగ్గింది.
ప్రభుత్వం దిగుమతి సుంకాల పెంపు.. ప్రధాని మోదీ పిలుపుతో దేశంలోకి బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. సాధారణంగా నెలకు 75నుంచి 100టన్నులుగా ఉండే దిగుమతులు అది 25 నుంచి 30 టన్నులకు పరిమితం అయ్యాయి. మే నెలలో బంగారం దిగుమతులు 39శాతం తగ్గి 3.42 బిలియన్ డాలర్లకు పరిమితం అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన జువెల్లరీ హబ్ లైన్ జైపూర్, పాట్నా వంటి నగరాల్లో బంగారం బిజినెస్ 50శాతం నుంచి 80శాతం మేర తగ్గినట్లు సమాచారం. పెళ్లిళ్లు కొనుగోళ్లు తప్ప సామాన్యులు పెట్టుబడి రూపంలో చేసే విచక్షణారహిత కొనుగోళ్లను భారీగా తగ్గించడమే ఈ ధరల తగ్గింపునకు మార్కెట్ స్లోడౌన్ కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.