
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
FIFA World Cup 2026: ముఖ్యంగా ఈ టోర్నీ ప్రారంభం నుంచి అందరి ద్రుష్టంతా దిగ్గజ ఆటగాళ్లు అయిన లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డ్, కిలియన్ ఎంబాపే, ఎర్లింగ్ హాలాండ్ పైనే ఉంది. ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఈ స్టార్ ప్లేయర్స్ మైదానంలో మ్యాజిక్ చేశారు. మరోవైపు తమ కెరీర్ లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్నారని భావిస్తున్న మెస్సీ, రొనాల్డో అద్బుత ప్రదర్శనలతో హిస్టరీ క్రియేట్ చేశారు. అర్జెంటినా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన ప్రపంచకప్ గోల్స్ సంఖ్యను 19కి పెంచుకున్నారు. దీంతో ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మరోవైపు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 6 వేరువేరు ప్రపంచకప్ లలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఈ స్టార్ దిగ్గజాలకు పోటీగా యువతరం ఆటగాళ్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఫ్రాన్స్ సంచలనం కిలియన్ ఎంబాపే తన ఖాతాలో మరో 4 గోల్స్ వేసుకుని మొత్తం 16 ప్రపంచకప్ గోల్స్ తో రికార్డు దిశగా దూసుకెళ్తూ దుమ్మురేపుతున్నాడు. ఇక ఎర్లింగ్ హాలాండ్ తొలిసారి ప్రపంచకప్ లో అడుగుపెట్టిన ఈ నార్వే ఆటగాడు గ్రూప్ దశలోనే 4 గోల్స్ సాధించి గోల్డెన్ బూట్ రేసులో తాను కూడా ఉన్నానని ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇప్పుడు ఈ నలుగురి మధ్య గోల్డెన్ బూట్ కోసం జరిగే పోటీ టోర్నీకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి.
ఈ సమరంలో కొన్ని జట్లు సంచలనాలు క్రియేట్ చేస్తే.. మరికొన్ని జట్లు తీవ్ర నిరాశపరిచాయి. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కేప్ వెర్డ్ జట్టు అద్భుతమైన డిఫెన్స్, అసాధారణమైన పోరాట పటిమతో బలమైన ప్రత్యర్థులను కూడా వెనక్కి నెట్టి నాకౌట్ దశకు చేరుకుంది. గోల్ కీపర్ వోజిన్హా అద్బుత సేవింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పాలి.
ఫెడెరికో వాల్వర్డే, డార్విన్ నూనెజ్ వంటి స్టార్ ప్లేయర్స్ తో బరిలోకి దిగిన ఉరుగ్వే, వరుసగా రెండవసారి గ్రూప్ దశలోని ఇంటికి పయనం అయ్యింది. డార్క్ హార్స్ గా భావించిన టర్కీ కూడా చెత్తగా ఆడి టోర్నీ నుంచి బయటకవచ్చింది. ఇక నాకౌట్ దశలో కొన్ని ఇంట్రెస్టింగ్ పూరులు ఫ్యాన్స్ ను అలరించనున్నాయి. బలమైన డిఫెన్స్ కు పేరుగాంచిన నెదర్లాండ్స్, మొరాకో మధ్య జరిగే మ్యాచీలో హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది.
ఇక ఫేవరేట్ జట్లలో ఒకటైన ఫ్రాన్స్ కు క్రమశిక్షణతో కూడిన ఆటతీరు కనబరిచే స్వీడన్ కు మధ్య పోరు మరింత ఆసక్తిని రేపుతోంది. బ్రెజిల్ అటాకింగ్ కు జపాన్ తనదైన శైలి ఆటకు మధ్య జరిగే మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక గ్రూప్ దశలో అద్బుత క్షణాలను అలరించిన ఈ టోర్నీ, నాకౌట్ దశలో ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ లవర్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.