
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Snake spotted near galigopuram steps in Tirumala: కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారం తిరుమల శ్రీవారి దర్శనాలకు భక్తులు పొటెత్తారు. ఎప్పుడు లేని విధంగా తిరుమలలో భారీగా భక్తులు తరలి రావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. టోకెన్లు లేని సర్వ దర్శనాలకు ఏకంగా 30 గంటల సమయం పడుతుంది. ఇక రూ. 300ల దర్శనాలకు 10 గంటల వరకు సమయం పడుతుంది. రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయి 6 నుంచి 8 కిలోమీటర్ల వరకు భక్తులు క్యూలు కట్టారు.
క్యూలైన్ లలో ఉన్న భక్తులకు ఇబ్బందులు కల్గకుండా టీటీడీ అన్న ప్రసాదాలు, అల్పాహరం, తాగునీరు మొదలైనవి శ్రీవారి సేవకులతో అందేలా చూస్తుంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలోని గాలి గోపురం వద్ద ఏకంగా 7 అడుగుల భారీ నాగు పాము హల్ చల్ చేసింది. దీంతో ఆ మార్గంలో కొండపైకి వెళ్తున్న భక్తులు తీవ్ర భయాందోళనలకుగురయ్యారు.
తిరుమల నడక మార్గంలో తరచుగా చిరుత పులులు, ఎలుగు బంట్లు, కోబ్రాలు అడవుల్లో నుంచి మెట్ల మార్గంలో, నడక మార్గంలో వస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా.. భారీ నాగు పాము ఒకటి గాలిగోపురం వద్ద వచ్చింది. అది ఏకంగా 7 అడుగుల పొడవు ఉంది. భారీ నాగుపాము కనిపించడంతో భక్తులు భయపడి పరుగులు తీశారు.
Read more: తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తులు.. వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి బుకింగ్ రద్దు!
వెంటనే టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమాచారంతో, ఫారెస్ట్ విభాగం ఉద్యోగి భాస్కర్ నాయుడు రంగంలోకి దిగాడు. అతగాడు కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకుని బంధించాడు. ఆ తర్వాత శేషాచలం కొండల్లోని దట్టమైన అవిలో సురక్షితంగా వదిలిపెట్టాడు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.