
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Food poisoning scare in east Godavari: రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ఎంట్రీతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ క్రమంలో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లగా ఉందంటే చాలా మంది వేడి వేడి పదార్థాలు తినేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. కొంత మంది ఇంట్లో ఏదైన పదార్థాలు చేసుకుంటే, దీనికి అవకాశం లేని వారు బైట బండిల మీద హోటల్స్ లలో దొరికే పదార్థాలు తింటారు. ముఖ్యంగా చాలామంది ఫాస్ట్ ఫుడ్ , పుణుగులు, మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు వంటివి తింటారు.
ఇటీవల చాలామంది మంది కల్తీ నూనెలను, పలుమార్లు ఉపయోగించిన నూనెలను మరల మరల బజ్జీలను వేయించేందుకు ఉపయోగిస్తున్నారు. దీంతో ఇవి తిన్న వాళ్లు కాస్త తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని కాజులూరు మండలంలో బండి మీద బజ్జీలు తిని ఏకంగా 23 మంది అస్వస్తతకు గురయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది. కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో రోడ్డు పక్కన బండిపై విక్రయించే బజ్జీలుతిని ఏకంగా 23 మంది వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. వారందరిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. బాధితులంతా ఒకే బండి వద్ద బజ్జీల్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
Read more: Hyderabad: ఎల్బీ నగర్ ఆస్పత్రిలో రెచ్చిపోయిన మహిళ.. డ్యూటీ డాక్టర్లపై దాడి చేస్తు అరాచకం.. వీడియో వైరల్..
ఈ క్రమంలో వైద్యులు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై బాధితుల కుటుంబ సభ్యులుతీవ్ర ఆందోళలనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉన్నఫుడ్ సెఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. దీనిపై బజ్జీల బండి వ్యక్తిని విచారిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.