
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Modi schemes: దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలు వెన్నుముకగా నిలుస్తాయి. ఈ ఎంఎస్ఎంఈలను ప్రధానంగా మూడు వర్గాలుగా విభజించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు. ఎంఎస్ఎంఈలకు సాధారణంగా ఎదురయ్యే అతి పెద్ద సవాలు ఏంటంటే.. నిధులు, పూచీకత్తు. చాలా మందికి అద్బుతమైన వ్యాపార ఆలోచనలు ఉంటాయి. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల వెనకంజ వేస్తుంటారు. అలాంటి వారి కోసం దేశంలోని మోదీ ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండానే లోన్స్ ఇచ్చేందుకు అద్భుతమైన స్కీములను ప్రవేశపెట్టింది. ఈ స్కీముల ద్వారా రూ. 15000 నుంచి 10 కోట్ల వరకు లోన్స్ తీసుకోవచ్చు. వీటిని ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఎవరు అర్హులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్: పీఎం ముద్రా యోజన కింద రూ. 50,000 నుండి రూ. 20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ రుణాలు చిన్న దుకాణాలు, రవాణా, సేవా రంగానికి అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం కింద వివిధ బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. రుణం పొందడానికి ఎలాంటి హామీని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ( PMEGP ) ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEP) పథకం ప్రత్యేకంగా కొత్త పారిశ్రామికవేత్తల కోసం రూపొందించింది. తయారీ రంగంలో ఉన్నవారికి రూ. 50 లక్షల వరకు, సేవా రంగంలో ఉన్నవారికి రూ. 20 లక్షల వరకు రుణాలు అందిస్తారు. ఈ పథకం తొలిసారిగా వ్యాపారం ప్రారంభించేవారి కోసం ఉద్దేశించింది. ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణం పొందవచ్చు.
సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్: సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ( CGTMSE ) పథకం, ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణాలు కోరుకునే పారిశ్రామికవేత్తలలో అత్యంత ప్రజాదరణ పొందింది . ఈ పథకం ద్వారా, తయారీ, సేవలు, వ్యాపారం, వర్కింగ్ క్యాపిటల్, యంత్రాల కోసం రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్ల వరకు రుణాలు పొందవచ్చు. ప్రభుత్వం బ్యాంకుకు లేదా NBFCకి గ్యారెంటీ కవర్‌ను అందిస్తుంది.
ప్రధానమంత్రి స్వనిధి పథకం: ప్రధానమంత్రి స్వానిధి యోజన సమాజంలోని అత్యంత నిమ్న వర్గాల పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పథకం వీధి వ్యాపారులకు, చేతిబండి వ్యాపారులకు లోన్ అందిస్తుంది. మొదటి విడతగా రూ. 15,000 రుణం (12 నెలల్లో తిరిగి చెల్లించాలి), రెండవ విడతగా రూ. 25,000 (18 నెలల్లో తిరిగి చెల్లించాలి), మూడవ విడతగా రూ. 50,000 (36 నెలల్లో తిరిగి చెల్లించాలి) అందిస్తారు. ఈ పథకానికి ఎలాంటి హామీ అవసరం లేదు. రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, కేవలం 7శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తుంది.
ఈ లోన్స్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? ఈ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం, సిడ్బి (SIDBI) ద్వారా నిర్వహిస్తాయి . ఈ పథకాలలో దేనినైనా పొందడానికి, మీరు బ్యాంకును లేదా ఎన్బిఎఫ్సి (NBFC)ని సందర్శించవచ్చు. మీ ప్రాజెక్ట్ నివేదిక, గత హిస్టరీని రివ్యూ చేసి.. మీకు సంబంధించిన లోన్ అందిస్తారు. అవసరమైన మీ పత్రాలను సమీక్షించిన తర్వాత బ్యాంకు మీకు లోన్ ఇస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.