
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CM Revanth reddy speech in Nalgonda public meeting: తెలంగాణ రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటించారు. ఈక్రమంలో నల్గొండలో సుమారు రూ. 13వేల కోట్లతో ఆర్ అండ్ బీ చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లా కనగల్ వేదికగా హ్యామ్ రోడ్ల పైలాన్ ను సైతం ఆవిష్కరించారు. నల్గొండ కార్పొరేషన్ లో తొలి దశ తాగునీటి ప్రాజెక్టు పనులకు , రూ. 83 కోట్లతో తొలిదశ తాగునటి శుద్ది కేంద్రంకు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ రోజుల్ని గుర్తుచేసుకుంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో మంత్రి పదవి త్యాగం చేశారని , ఆ తర్వాత మరల కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన మంత్రి పదవి త్యాగం చేశారని గుర్తుచేశారు. ఇక బీఆర్ఎస్ కు గతమే కానీ భవిష్యత్తు లేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత పదేళ్ల పాలనను, తమ రెండున్నరెళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడేందుకు తాము సిద్దమని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు.
తులసి వనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో ఒక జానెడు ఉన్న వ్యక్తి మిగిలిడాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన్నుకూడా ఓడిస్తామని కొంతమంది యువకులు తనతో చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎవడు ఆత్మహత్య చేసుకున్నా, ఎవడు అడ్డం పడ్డా మూసీలో వేసి తొక్కి మరీ మూసీ పనులు పూర్తి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెల్చిచెప్పారు.
ఎస్ ఎల్ బీసీని 2028 వరకు పూర్తి చేస్తామన్నారు. ఈ క్రమంలో పదేళ్ల పాటు తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నారని ఒక్క మహిళకు కూడా మంత్రి పదవిలో చాన్స్ ఇవ్వలేదని సీఎం రేవంత్ ఏకీపారేశారు. వంద రూపాయల పెట్రోల్ తెచ్చి పది పైసల అగ్గిపెట్టె దొరకని మిమ్మల్నీ ఏమనాలి.. అంతే కాకుండా.. శ్రీకాంతా చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య త్యాగాన్ని ఏమనాలని బీఆర్ఎస్ నేతల్ని ఏకీపారేశారు.
ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని గుర్తు చేశారు. వంద రూపాయల పెట్రోల్ తెచ్చుకని , పది పైసల అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టే రావు పదేళ్ల పాటు మంత్రి పదవిలో ఉన్నారని సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది లక్షల 11 వేల కోట్ల అప్పులతో తెలంగాణను పదేళ్లలోనే 100 యేళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన బీఆర్ఎస్ ను ఏమనాలని ఏకీపారేశారు. బావా బామర్థులు తోడేళ్లలా తిరుగుతున్నారని,
మళ్లీ అధికారం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెపుతున్నారని విమర్శించారు. కానీ ప్రజలు కోరుకోవడం లేదు..మీ కుటుంబమే కోరుకుంటుందని సీఎం రేవంత్ సెటైర్ లు వేశారు. తెలంగాణ సమాజం శాశ్వతం గా మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేశారని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ను ఉప్పుపాతర వేశాం.. మొక్క కూడా మొలనివ్వమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్పారన్నారు.
అధికారం కోల్పోయిన అక్కసుతో కడుపు నిండా విషంతో మూసీలో ఉన్న కాలుష్యం కంటే కడుపులో ఉన్న కంపు ఎక్కువైందని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఏం చేసింది, రేవంత్ రెడ్డి ఏం తెచ్చాడని అడుగుతున్నారని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు , శాసనమండలి సమావేశాలు ఏర్పాటు చేస్తామని.. పదేళ్లలో బీఆర్ఎస్ పాలన, 12 యేళ్ల బీజేపీ పాలన, రెండున్నర యేళ్ల మా పాలన పైన చర్చించడానికి మేం సిద్దమని, బీజేపీ, బీఆర్ఎస్ , కాంగ్రెస్ మ్యానిఫెస్టో లపైన చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్ కు ప్రతిపక్షాలు లేఖ రాయాలని.. ఎవరు ఏం చేశారో అసెంబ్లీలో తేల్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పండగపూట సోదరుడు పెట్టిన చీరల్లో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని, ఐదేళ్లలో ఒక్క మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, మా ప్రభుత్వం లక్షలాది రేషన్ కార్డు లు ఇచ్చిందన్నారు. పేదలకు ఆ నాడు దొడ్డు బియ్యం ఇస్తే బుర్రెలకు దాణాగా పెట్టారని కానీ ఆర్థికంగా భారమైన పేదవాడి కడుపు నింపాలని సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. 16 వేల కోట్ల రూపాయలతో మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది కి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామన్నారు.
ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్, జన్వాడ లో ఉన్న కేటీఆర్ ఏ సన్న బియ్యం తింటున్నారో పేదల పిల్లలు కూడా అవే తింటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పేద వాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని.. నాలుగున్నర లక్షల ఇళ్లను పేదలకు ఇచ్చామన్నారు.
Read more: Kalvakuntla Kavitha: ఇడుపు కాయితం అంటే పవన్ కళ్యాణ్‌కు బాగా తెలుసు.!. కవిత సంచలన వ్యాఖ్యలు..
పేదలు ఇళ్లు కట్టుకుంటే వాళ్ల కళ్లు కుడుతున్నాయని విమర్శించారు.పేదల ఇళ్ల కు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వాళ్ల కళ్లకు కనిపించలేదా..? .. రైతు రుణమాఫీ, రైతు భరోసా , రైతు బోనస్ తో పాటు అనేక కార్యక్రమాలతో లక్షా యాభై ఆరు వేల కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చు చేశామన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.