
ప్రవాసాంధ్రుల పిల్లలు మాతృభాషను మర్చిపోవడం ఆయనకు ఆవేదన కలిగించింది. భాష నేర్చుకోవడంలో పిల్లలు పడుతున్న ఇబ్బందులను అధిగమించడంపై ఆలోచింపజేసింది.
సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే సంకల్పంతో ఆయన ముందడుగు వేశారు. కృత్రిమ మేధను జతచేసి కూల్ఫాబెట్స్ పేరుతో ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్ రూపొందించారు. ఇంటర్నెట్తో సంబంధం లేకుండా పనిచేయటం ఈ యాప్ ప్రత్యేకత. ఐదు భారతీయ భాషల్లో సిద్ధమైన ఈ యాప్‌ను భవిష్యత్‌లో మిగతా భాషలకు విస్తరిస్తామంటున్న యాప్ రూపకర్త కొల్లు రంజిత్‌తో ముఖాముఖి. ఈ వార్త చదివారా: పిల్లల ఆలనా పాలనా తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదు: చంద్రబాబు