
AP EAPCET 2026 Results | ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఎప్సెట్ (AP EAPCET 2026) ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది.
ఈ ఫలితాలను ఈ నెల 30న (మంగళవారం) ఉదయం విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ‘ఎక్స్’ వేదికగా ఈ ఫలితాలు విడుదల చేస్తారని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్, ఎప్సెట్ ఛైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. అయితే, ఎన్ని గంటలకు ర్యాంకులను ప్రకటిస్తారనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.
మే 12 నుంచి 20 వరకు ఎప్సెట్ పరీక్షలు జరగ్గా.. దాదాపు 3.29లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమైతే జూన్ 1 నాటికే ఈ ఫలితాలు వెలువడాల్సింది. అయితే, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండటంతో.. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే వరకు అధికారులు ఆగడంతో జాప్యం నెలకొంది. తాజాగా సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరడంతో ఈ నెల 30న ఎప్సెట్ ఫలితాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.