
పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐదేళ్లలోపు చిన్నారులకు సీఎం పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారు
ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకొని కాసేపు ఆడించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ వార్త చదివారా: మత్స్యకార గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: మంత్రి అనిత