
ప్రియదర్శి (Priyadarshi), నాగదుర్గ (Naga Durga) జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ఇడుపు కాగితం (Idupu Kagitham) . వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిసస్తోన్న ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన...
ప్రియదర్శి (Priyadarshi), నాగదుర్గ (Naga Durga) జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ఇడుపు కాగితం (Idupu Kagitham) . వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిసస్తోన్న ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్‌పై సమర్పిస్తుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (Bunny Vas) నిర్మిస్తున్నాడు.
ప్రియదర్శి (Priyadarshi), నాగదుర్గ (Naga Durga) జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ఇడుపు కాగితం (Idupu Kagitham) . వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిసస్తోన్న ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్‌పై సమర్పిస్తుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (Bunny Vas) నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకొని సెట్స్ మీదకు వెళ్ళింది. ఎప్పుడైతే మేకర్స్ ఈ టైటిల్ ని అనౌన్స్ చేశారో.. అప్పటి నుంచి వివాదాల మొదలయ్యింది. ఆంధ్రా- తెలంగాణ భాషల మధ్య ఈ టైటిల్ పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం అని అర్ధం. అసలు ఇదేం టైటిల్.. ఎవరికి అర్ధమవుతోందని ఆంధ్రావారు ట్రోల్ చేయడంతో.. కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో యాస మీద రచ్చ జరుగుతోంది. తెలంగాణ వారు.. ఆంధ్రా యాసను.. ఆంధ్రావారు.. తెలంగాణ యాసను ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా సీనియర్ నటుడు నరేష్.. ఈ భాషా వివాదంపై స్పందించాడు. ఈ సినిమా చుట్టూ రాజుకున్న యాస వివాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. సినిమా టైటిల్ లో ఉపయోగించిన మాతృభాష తెలుగులోని తెలంగాణ యాసను కొందరు ఆకతాయిలు కావాలనే తప్పుగా చిత్రీకరిస్తూ దెబ్బతీస్తున్నారని, దానికి తోడు మీడియా కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఆ మంటల్లో మరింత నెయ్యి పోస్తోందని నరేష్ తీవ్రస్థాయిలో మండిపాడు. మనకు మనమే మన భాషా వృక్షానికి ఉన్న కొమ్మలను నరుక్కోవడం అత్యంత మూర్ఖత్వం అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు.
'ఈ ఇడుపు కాగితం సినిమాకు వస్తున్న క్రేజ్ మరియు అటెన్షన్ చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ, అదే సమయంలో కొంతమంది ఆకతాయిలు మన మాతృభాష అయిన తెలుగులోని తెలంగాణ యాసను కావాలనే దెబ్బతీస్తున్న తీరు.. దానికి మీడియా కూడా మరింత ఆజ్యం పోస్తూ మంటలు రాజేస్తున్న విధానం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు కరుప్పు అంటే ఎంతమందికి అర్థం తెలుసు? కాంతార అంటే ఎంతమందికి తెలుసు? అయినా సరే మనం ఆ సినిమాలను హ్యాపీగా ఎంజాయ్ చేయలేదా? ఆ భాషల గురించి మనం ఎప్పుడైనా వివాదాలు సృష్టించామా? మనం రాజకీయంగా, భౌగోళికంగా విడిపోయి ఉండవచ్చు.. కానీ మనమంతా ఒకటే, మనది ఒకే రక్తం.. అదే తెలుగు రక్తం. దయచేసి మన అమ్మలాంటి మాతృభాషను అవమానించకండి. తెలుగులోని ప్రతి యాసకు ఒక గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక సమ్మేళనం ఉన్నాయి.
మ్యాప్ నుండి ప్రాంతీయ భాషలు ఎక్కడ కనుమరుగైపోతాయో అనే భయం పొంచి ఉన్న ఇలాంటి తరుణంలో.. మనకు మనమే మన కొమ్మలను నరుక్కోవడం చాలా మూర్ఖత్వం అవుతుంది. మన తెలుగు భాషా సంఘం మాత్రమే ఈ విషయంలో జోక్యం చేసుకుని, మాట్లాడి, ఈ వివాదానికి ముగింపు పలకగల ఏకైక అథారిటీ. నేను ఇప్పుడు మీడియాకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.. దయచేసి ఈ క్షణమే ఈ వివాదాన్ని ఇక్కడితో నొక్కేసి, సైలెంట్ చేయండి.. ఇప్పుడే' అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ యాస వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.