
వైకాపా బృందం అమరావతి పర్యటనలో ఘర్షణకు సంబంధించి తెదేపా నేతలు ఓ వీడియో విడుదల చేశారు. గతంలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వైకాపా నేత పానుగంటి చైతన్య.. శనివారం అమరావతి పర్యటనలోనూ ఉన్నాడు.
ఈ రెండు ఘటనల్లోనూ చైతన్య ఉన్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారం రాజధాని రైతులపై జరిగింది వైకాపాకు చెందిన రౌడీమూకల దాడేనని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు పాల్గొన్నట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఘటనపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ వార్త చదివారా: పేదలకు ఉపాధి కల్పిస్తే ఓర్వలేరా జగన్?: మంత్రి లోకేశ్