
ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కుమార్తె పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం రాత్రి గోవాలోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. చిరంజీవి, నాగార్జున, త్రిష తదితరులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.
Jun 26 2026 6:25 PM | Updated on Jun 26 2026 6:37 PM
ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కుమార్తె పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం రాత్రి గోవాలోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. చిరంజీవి, నాగార్జున, త్రిష తదితరులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. వీళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఖుష్బూ.. పెళ్లి ఫొటోలని షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ)
'ప్రస్తుతం మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కుటుంబమే ఎప్పుడూ మా జీవితంలో అత్యంత విలువైనది. వివాహాలు స్వర్గంలోనే నిర్ణయిస్తారని మేం నమ్ముతాం. మా కుమార్తె అవంతిక, శ్రవణ్‌ల వివాహం మా జీవితంలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది. పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల ప్రేమాభిమానాల మధ్య ఈ వివాహ వేడుక ఎంతో ఆత్మీయంగా జరిగింది. వధూవరుల కోరిక మేరకు అత్యంత సాదాసీదాగా, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ వేడుక నిర్వహించాం'
'కొన్ని సందర్భాల్లో అత్యంత అందమైన క్షణాలు మనకు అత్యంత దగ్గరైన వారితో కలిసి గడిపేవే. అవంతిక, శ్రవణ్‌లు తమ వైవాహిక జీవితంలో ఆనందం, అనుబంధం, ప్రేమతో కూడిన చిరకాల సంతోషాన్ని పొందాలని కోరుకుంటున్నాం. వారిద్దరికీ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, శుభాకాంక్షలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం" అని ఖుష్బూ దంపతులు తమ పోస్టులో రాసుకొచ్చారు. అవంతిక ప్రస్తుతం ఓ మలయాళ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా)
శోభిత మాన్సూన్ లుక్.. గ్లామర్ మూమూలుగా లేదు! (ఫొటోలు)
థాయ్‌ల్యాండ్ బీచ్ వెకేషన్లో సినిమా జంట (ఫొటోలు)
సూపర్‌స్టార్ మూవీ లాంచ్ కోసం రాశీఖన్నా ఇలా (ఫొటోలు)
కేన్స్‌లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు
పెద్ద సైకో... వాడు మళ్లీ బయట తిరగకూడదు రాధా గాయత్రి తండ్రి, పిన్ని
ముద్రగడను పరామర్శించిన బొత్స, తోట త్రిమూర్తులు
సాయి కృష్ణ తల్లి ఓడిపోవడం ఖాయం ఎందుకంటే..! అడ్వొకేట్స్ సంచలన నిజాలు
నాకు ముగ్గురితో ఎఫైర్లున్నాయి, వాళ్లు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
హత్య కేసులో బిగ్ ట్విస్ట్..! వాచ్ మెన్ సంచలన విషయాలు