
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Earthquake in Philippines Mindanao city: ప్రపంచ దేశాల్ని భూకంపాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వెనిజులాలో సంభవించిన భూకంప తీవ్రతతో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు. వెనిజులా రాజధాని కరాకాస్, మోంటెన్ ప్రాంతాల్లో చాలా భవనాలు పేకమెడాలా కూలిపోయాయి. ఈ శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుని దుర్మరణం చెందారు.
కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే .. మొదట 7.1 తీవ్రతతో, అనంతరం 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పటికి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మరో విషాదం చోటు చేసుకుంది. ఫిలీప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి.
దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలోని మిండానో సమీపంలో 6.7 తీవ్రతతో శుక్రవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, మిండనో ద్వీపంలోని సరంగాని పట్టణానికి నైరుతి దిశలో సుమారు 21 కిలోమీటర్ల దూరంలో, 65.7 కిలోమీటర్ల (41 మైళ్ల) లోతులో భూకంపం సంభవించింది.
Read more: Venezuela Earthquake: వెనిజులాలో ప్రళయం.. 7.5 తీవ్రతతో భూకంపం, 10,000 మంది మృతి? కూలిన భవనాలు, భీతిల్లుతున్న జనం!
వెంటనే అధికారులు అక్కడి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎక్కడి కక్కడ భవనాలు నెలకూలాయి. పెద్ద పెద్ద అపార్ట్ మెంట్ భవంతులు పేకమెడల్లా కూలిపోయాయి. వెంటనే ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ భూకంప ప్రభావంకు సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కొన్ని వారాల క్రితం ఇక్కడే సంభవించిన భూకంపంతో 80 మంది తమ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.