
IND vs IRE : రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
Big shock to Team India Ireland won by 34 runs in 1st t20
IND vs IRE : రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (50; 20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికి మిగిలిన వారు ఘోరంగా విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3), వాషింగ్టన్ సుందర్ (9)లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. తిలక్ వర్మ (19), శివమ్ దూబె (25) ఫర్వాలేదనిపించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో మాథ్యూ హోల్లార్డ్, మాథ్యూ హంఫ్రీస్ లు చెరో మూడు వికెట్లు తీశారు. జై మూండ్రా రెండు వికెట్లు పడగొట్టగా లియామ్ మెక్‌కార్తీ, గారెత్ డెలానీ లు ఒక్కొ వికెట్ సాధించారు.
Sanju Samson : తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన సంజూ శాంసన్.. ఇప్పుడెలా?
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. గారెత్ డెలానీ (49; 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబె ఓ వికెట్ పడగొట్టాడు.