పుణెకు చెందిన బిజినెస్మెన్ కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కేతన్ అగర్వాల్ భార్య సియా గోయల్ నిందితురాలిగా ఉన్నారు.
అయితే ఈ కేసుకు సంబంధించి మరో వార్త తెరపైకి వచ్చింది. కేతన్ అగర్వాల్ విగ్గు పెట్టుకుంటాడని.. ఇది నచ్చకే సియా గోయల్ అతన్ని హత్య చేసేందుకు ప్రియుడు చేతన్ చౌదరికి సహకరించారనే వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ దీనిపై స్పందించారు. ఏమిటండీ ఇది.. విగ్గు పెట్టుకుంటేనే సంపెత్తారా అంటూ పీవీ సునీల్ ఈ వార్తను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.దీంతో పీవీ సునీల్ కుమార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే పీవీ సునీల్ కుమార్ ఈ సెటైరికల్ ట్వీట్ చేశారని..కేతన్ అగర్వాల్ హత్య కేసును ఏపీకి ముడిపెడుతూ సునీల్ కుమార్ ట్రోల్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి కేతన్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే విగ్గు కారణంగానే హత్య జరిగిందనే వార్తలన విశాల్ ఖండించారు. కేతన్ అగర్నాల్ విగ్గు వాడుతున్నాడని నిశ్చితార్థానికి ముందే సియా గోయెల్, ఆమె కుటుంబానికి తెలుసన్నారు. తన కుమారుడికి తలపై చిన్న భాగంలో జుట్టు రాలిందని.. నిశ్చితార్థానికి చాలా ముందే ఈ విషయం గురించి సియా గోయల్ కుటుంబంతో మాట్లాడినట్లు తెలిపారు. మరోవైపు కేతన్ అగర్వాల్, సియా గోయల్‌ల పెళ్లి నవంబర్ నెలలో రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో జరగాల్సి ఉంది. అయితే ఈలోపే కేతన్ అగర్వాల్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపగా.. ఐపీఎస్ సునీల్ కుమార్ దీనిని ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.