
Samsung Galaxy S26 Plus : కొత్త శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారీ డిస్ప్లేతో శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ సరసమైన ధరకే లభిస్తోంది.
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ మీ బడ్జెట్ ధరలోనే లభ్యమవుతోంది. ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై (Samsung Galaxy S26 Plus) ఏకంగా రూ. 37వేలకుపైగా ఆదా చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ డీల్స్, ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలివే..
ధర, ఆఫర్లు : శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ ఫోన్ 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 84,999 ధరకు లభిస్తోంది. ఫిబ్రవరి 2026లో రూ. 1,19,999 ధరకు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 2549 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ. 82,450 అవుతుంది.
మరోవైపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లో పాత ఫోన్ మార్చితే రూ. 34,600 వరకు అదనంగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తి బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ ధర కన్నా సుమారు రూ. 37 వేలు తక్కువకే లభిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ 1440×3120 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్‌యూఐ 8.5పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు శాంసంగ్ సొంత డెకా-కోర్ ఎక్సినోస్ 2600 ప్రాసెసర్ అందిస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB/512GB స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది.
Read Also : Car Loan EMI : కారు లోన్ ఈఎంఐ కట్టలేదా? బ్యాంక్ వెంటనే మీ కారు సీజ్ చేస్తుందా? ఆర్బీఐ రూల్స్, మీ హక్కులివే!
శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్‌లో 4,900mAh బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కొలతల పరంగా ఈ ఫోన్ 158.4 మిమీ పొడవు, 75.8 మిమీ వెడల్పు, 7.3 మిమీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్లలో గైరోస్కోప్, ఇ-కంపాస్, యాక్సిలరోమీటర్, బారోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.