
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Jonnagiri Gold Mine: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న జొన్నగిరిలో బంగారం గనుల ప్రొడక్షన్ ప్రారంభమైంది. దేశంలోని తొలి ప్రైవేట్ బంగారం గనిగా జొన్నగిరి పేరు సంపాదించుకుంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జొన్నగిరి పేరును స్వర్ణ గిరిగా మార్చేసింది. ఇదిలా ఉంటే జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ చేసేందుకు అనుమతులను పొందింది. ఈ ప్రాజెక్టులో జియో మైసూర్ సర్వీస్ తో పాటు డెక్కన్ గోల్డ్ మైన్స్, లాయిడ్స్ ,మెటల్సెండ్ ఎనర్జీ, త్రివేణి ఎర్త్ మూవర్స్ వంటి సంస్థలు కూడా భాగస్వాములుగా పెట్టుబడిదారులుగా ఉన్నాయి. అయితే ప్రాథమికంగా జొన్నగిరి మైన్స్ నుంచి ప్రతి ఏటా 400 టన్నుల బంగారం ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ జియో మైసూర్ సర్వీస్ సంస్థ కేవలం మైనింగ్ మాత్రమే కాదు గోల్డ్ ప్రాసెసింగ్ కూడా నిర్వహిస్తుందట. బంగారం ప్రాసెసింగ్ నిర్వహించి బంగారాన్ని కడ్డీలుగా మార్చి అమ్మకానికి కూడా పెడుతున్నారట. అయితే స్థానికంగా బంగారం ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి అక్కడ ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుందా ?
ఈ సందేహం ఎందుకు నెలకొంది అంటే.. సాధారణంగా మైనింగ్ అలాగే ప్రాసెసింగ్ వంటివి స్థానికంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఉత్పత్తి అయ్యే బంగారంపై ఎక్సైజ్ డ్యూటీ కూడా ఉండదు. కాబట్టి ధర తక్కువగా లభించే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతుందో తెలుసుకుందాం.
బంగారం ధర అనేది సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది. స్థానిక పన్నుల వల్ల ధరల్లో స్వల్ప తేడా ఉంటుంది. కానీ బేస్ ధర మాత్రం ప్రపంచమంతా ఒకే విధంగా ఉంటుంది. అంతర్జాతీయంగా బంగారం మార్కెట్ ధరలను లండన్ బులియన్ మార్కెట్ నిర్ణయిస్తుంది. అలాగే దేశీయంగా ఎంసిఎక్స్ బంగారం ధరలను నిర్ణయిస్తుంది. కాబట్టి బంగారం ఎక్కడ ఉత్పత్తి అయినా ఆ ధరలకు అనుగుణంగానే విక్రయించే ఛాన్స్ ఉంటుంది.
మైనింగ్ కంపెనీ కాబట్టి ధర తగ్గిస్తారా అని అనుమానం రావచ్చు. కానీ అలాంటి అవకాశం ఉండే వీల్లేదని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే నిజానికి బంగారం దాదాపు 90శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. కాబట్టి దీనిపై ఎక్సైజ్ సుంకం కూడా విధిస్తుంటారు. కానీ జొన్నగిరి లాంటి మైన్స్ లో స్థానికంగా బంగారం ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఎక్సేంజ్ ఇక్కడ ఉండదు. కానీ ఆ లాభం మైనింగ్ కంపెనీ పొందుతుంది. దాని కస్టమర్లకు అడ్వాంటేజ్ ఇవ్వరు.
ఇక స్థానికంగా ఉత్పత్తి అవుతున్న బంగారంపై కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి 4 శాతం రాయాలిటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక జియో మైసూర్ సంస్థ జొన్నగిరిలో ఉత్పత్తి చేసిన బంగారాన్ని నేరుగా కస్టమర్లకు విక్రయించదు. దీన్ని ఆర్బిఐ లేదా బ్యాంకులో లేదా పెద్ద పెద్ద జ్యువెలరీ సంస్థలకు హోల్ సేల్ ప్రాతిపదికన విక్రయిస్తుంటారు. ప్రస్తుతం జొన్నగిరిలో ఉత్పత్తి అయిన బంగారాన్ని తొలి విడతలో స్థానిక నగల తయారీ సంస్థలకే విక్రయించారు. అయితే జొన్నగిరిలో సామాన్య రిటైల్ కస్టమర్లకు బంగారం తక్కువ ధరకు దొరుకుతుందా అంటే దాదాపు అసాధ్యం అని చెప్పాలి. జొన్నగిరి అయినా మరే పట్టణంలో అయినా బంగారం ధర ఒకేలా ఉంటుంది. కాబట్టి తక్కువ ధరకు దొరకడం అసాధ్యమని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.