
కెనడాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి ట్రెక్కింగ్ చేస్తుండగా ఎలుగుబంటి వెంటపడింది. అది ఆ మహిళపై దాడి చేయడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆ మహిళ ఎంతో ధైర్యంతో దానికి ఎదురు తిరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎలుగుబంటి ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలుగుబంట్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎలుగుబంట్లు తమ పదునైన గోళ్లు, పళ్లతో ఏ జీవినైనా ఇట్టే చంపేయగలవు. ఎంతో ప్రమాదకరమైన ఎలుగుబంటి వెంటపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. కెనడాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి ట్రెక్కింగ్ చేస్తుండగా ఎలుగుబంటి వెంటపడింది. అది ఆ మహిళపై దాడి చేయడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆ మహిళ ఎంతో ధైర్యంతో దానికి ఎదురు తిరిగింది.
చివరకు దాన్ని అడవిలోకి తరిమేసింది. లేదంటే ఆమె ప్రాణాలు, పెంపుడు కుక్క ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టోనీ లేన్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో శుక్రవారం ఆ వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ కెమెరా పట్టుకుని తన పెంపుడు కుక్కతో కలిసి కొండ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తోంది. ఓ పెద్ద ఎలుగుబంటి సడెన్గా రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డుపై వెళుతున్న వీరిని చూసింది. మనిషి, కుక్కను చూడగానే ఎలుగుబంటి తన రూటు మార్చుకుంది.
ఆ మహిళను వెంటపడ్డం మొదలెట్టింది. భయపడిపోయిన మహిళ అక్కడినుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించింది. ఆ ఎలుగుబంటి ఆమెను వదల్లేదు. ఆమె అరుస్తూ దాన్ని తరమడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆ ఎలుగుబంటి అటు, ఇటు తిరుగుతూ దాడి చేయడానికి ప్రయత్నించింది. మహిళ ధైర్యాన్ని వీడలేదు. చాలా సేపటి పోరాటం తర్వాత ఎలుగుబంటి వెనక్కు తగ్గింది. అక్కడినుంచి అడవిలోకి వెళ్లిపోయింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
మహిళా కానిస్టేబుల్ నిర్వాకం.. ఎదురుగా ఉన్నది పెద్దాయన అని తెలిసీ..