తెలంగాణలో సామాన్యుడి వంటగది బడ్జెట్‌పై అదనపు భారం పడింది. గత మూడు నెలలుగా నిరంతరంగా పెరుగుతున్న కోడిగుడ్డు ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.
8 పలుకుతుండగా, సమీప భవిష్యత్తులో ఇది రూ.10కి చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం అమలుపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) గణాంకాల ప్రకారం, హైదరాబాద్‌లో జూన్ 20-26 మధ్య హోల్‌సేల్ ధర రూ.6.35గా నమోదైంది. ఈ నెల ప్రారంభంలో రూ.5.55గా ఉన్న ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా రిటైల్ వ్యాపారులు ప్రాంతాన్ని బట్టి రూ.6.80 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వేసవి తీవ్రతకు రాష్ట్రంలోని పౌల్ట్రీ ఫారాల్లో సుమారు 10 శాతం మేర కోళ్లు మృతి చెందడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీనికి తోడు కోళ్ల దాణా, మందుల ఖర్చులు పెరగడం కూడా సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపింది.ప్రస్తుతం ఒక్కో గుడ్డు ఉత్పత్తికి రైతుకు రూ.7 వరకు ఖర్చవుతుండగా, ఫాం గేట్ వద్ద మాత్రం రూ.6 మాత్రమే లభిస్తోందని జాతీయ ఉత్తర తెలంగాణ గుడ్ల సమన్వయ కమిటీ ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. గతంలో పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎదురైన నష్టాలను ప్రస్తుత ధరల పెరుగుదల కొంతమేర భర్తీ చేస్తోందని ఆయన వివరించారు.మరోవైపు, తాము రూ.6.50 చొప్పున కొనుగోలు చేసి, రవాణా తదితర ఖర్చులు పోను