
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Man making reels with dead snake in uttar pradesh: ఇటీవల కొంత మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. అంతే కాకుండా కోబ్రాలతో డెంజరస్ స్టంట్ లు, రీల్స్ చేస్తున్నారు. కావాలని తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి మరీ కోబ్రాలతో రీల్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం యూపీకి చెందిన సలీమ్ అనే యువకుడు చనిపోయిన పామును పట్టుకున్నాడు. దానితో చాలా డెంజర్ గా రీల్స్ చేశాడు. ఆ తర్వాత అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
పాములతో జాగ్రత్తగా ఉండాలని ఎంత చెప్పిన కూడా కొంత మంది అస్సలు విన్పించుకొవడంలేదు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లో సలీమ్ అనే యువకుడికి చనిపోయిన పాము కన్పించింది. మరీ అది ఎలాగో చనిపోయింది దానికి విషం ఏముందని అనుకున్నాడు. దాన్ని నోట్లొ పెట్టుకుని పండ్లతో కొరికినట్లు చేశాడు. పామును తన మెడలో వేసుకుని హల్ చల్ చేశాడు.
బతికున్న పామును పట్టుకున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. మొత్తంగా తనకున్న పైత్యంను చనిపోయిన పాము మీద చూపిస్తు రీల్స్ తీసుకున్నాడు. కానీ ఇంతలో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో, పాములోని విషం అతని పళ్ళ ద్వారా శరీరంలోకి ప్రవేశించినట్లు వైద్యులు వెల్లడించారు.
Read more: Snake Video: ఇదెక్కడి మాస్ రా మావా.!. విషపూరితమైన పాములతో ఉప్పర్ మీటింగ్.!. వీడియో వైరల్..
ప్రస్తుతం సలీం కండీషన్ చాలా సీరియస్ గా ఉంది. అతడ్ని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతగాడి రీల్స్ పైత్యం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు తిక్క కుదిరిందని సెటైర్లు వేస్తున్నారు.