
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Gossip movie review rating Public talk: తెలుగులో గత కొన్నేళ్లుగా కొత్త తరహా చిత్రాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘గాసిప్’ అనే టైటిల్ తోనే సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేశారు మేకర్స్. రాశి సింగ్ మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో బలంగా వెళ్లాయి. ఈ రోజు విడులైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం.
ప్రకాశం (రవివర్మ)కు తన ముద్దుల చెల్లెలును రమేష్ (విజయ్ ఆదిరాజు)కు ఇచ్చి వివాహాం జరిపిస్తాడు. ఆ తర్వాత ప్రసవం సమయంలో ప్రకాశం చెల్లెలు ఓ బిడ్డను కని కన్నుమూస్తుంది. పుట్టిన ఆడపిల్లకు (అజంత) అని పెడతారు. ఇక ప్రకాశం తన చెల్లెలు కూతురును అల్లారు ముద్దుగా పెంచుకుంటానని చెబుతాడు. కానీ బిడ్డ తండ్రి అయిన రమేస్.. తన కూతురును నలుగురుకీ ఇన్స్ప్రేషన్ కలిగేలా పెంచుతానని తన బామ్మర్ధికి ఛాలెంజ్ చేసి మరి పెంచుతాడు. . ఈ క్రమంలో కూతురు అజంత పెద్దవుతుంది. ఆమె పెద్దయ్యే క్రమయంలో అజంతపై కొంత మంది పనిగట్టుకొని కొన్ని గాసిప్స్ పుట్టిస్తారు. ఆ గాపిస్స్ వల్ల ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు అజంతా జీవితంలో గాసిప్స్ పుట్టించిందెవరు..? ఈ క్రమంలో అజంత జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
దర్శకుడు వైభవ్ కౌండిన్య ప్రస్తుతం సోషల్ మీడియాలో యుగంలో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్నారు. నిజాన్ని అబద్దంగా.. అబద్దాన్ని నిజంగానే కొంత మంది నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పుకార్లు (గాసిప్) ఓ అమ్మాయి జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందనే పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. దాన్నే అదే రేంజ్లో తెరపై మలచడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ సో సోగా సాగిదీతాగా అనిపించినా.. కథానాయికగా అజంతాపై ఓ గాపిస్ పుట్టుకురావడం.. ఆపై ఆమె అనుకోకుండా చిక్కుల్లో పడటం.. ఆ తర్వాత దాన్నుంచి బయట పడటానికి ఎలాంటి సమస్యలను ఫేస్ చేసిందనే ఇతివృత్తం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. ఈ కథను ఈ అంశాన్ని దర్శకుడు ఇంకాస్త బలంగా చెప్పి ఉంటే బాగుండేది. థియేట్రికల్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం. ఇంకోవైపు ఓటీటీలో ఇలాంటి సినిమాలకు మంచి ఆదరణ దక్కడం గ్యారంటీ. ఓ వేళ థియేట్రికల్‌గా వర్కౌట్ కాకపోయినా.. ఓటీటికి పనికొచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా పుకార్లు .. ఓ సాధారణ మహిళలతో పాటు.. మన సొసైటీని ఆలోచింపే జేసే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. సినిమాలో కథ పరంగా వచ్చే సంభాషణలు బాగున్నాయి. సంగీతం పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు పర్వాలేదు.
'ప్రసన్నవదనం', '3 రోజెస్' సీజన్ 2 వెబ్ సిరీస్‌లతో అటు సిల్వర్ స్క్రీన్ పై ఇటు ఓటీటీ లో విజయాలతో దూసుకుపోతుంది రాశి సింగ్. ఈ సినిమాలో సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. కొత్త తరహా పాత్రలకు తను బెస్ట్ చాయిస్ అనేలా ఈ సినిమాలో రాశి సింగ్ నటన ఉంది. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించడం విశేషం. కథానాయిక మేనమామగా రవివర్మ.. తండ్రిగా విజయ ఆదిరాజుల నటన బాగుంది. 30 ఇయర్స్ పృథ్వీ ఈ సినిమాలో బలమైన పాత్రలో కనిపించి నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘గాసిప్’.. సమాజాన్ని ఆలోచింపజేసే ఫ్యామిలీ స్టోరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.