
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
EPF Investment: పదవి విరమణ తర్వాత భారీగా నిధిని నిర్మించుకోవాలంటే.. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ వంటి స్కీములో చేసే.. చిన్న క్రమమైన పెట్టుబడులు దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టిస్తాయి. దీనికి ప్రధాన కారణం ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ కాలక్రమైనా పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈపీఎఫ్ పై 8.25శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది.ఇదొక సురక్షితమైన ఆకర్షణీయమైన పొదుపు ఎంపికగా నిలుస్తుందని చెప్పాలి.
ఒక ఉద్యోగి ఈపీఎఫ్ కు నెలకు 1800 రూపాయలు జమ చేసినట్లయితే ఆ మొత్తం ఒక ఏడాదిలో 21,600రూపాయలు అవుతుంది. ఈ పెట్టుబడి 25 ఏళ్ల పాటు నిరంతరంగా కొనసాగినట్లయితే.. మొత్తం డిపాజిట్ సుమారుగా 5.4 లక్షలు అవుతుంది. అయితే వడ్డీ, చక్రవడ్డీ కారణంగా చివరి నిధి అనేక రేట్లు ఎక్కువగా పెరుగుతుంది. 25 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం సుమారు 18 లక్షల నుంచి 19 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దీనిలో కేవలం వడ్డీ నుంచే సుమారుగా 13 లక్షల రూపాయలు పొందవచ్చు.
ఈపీఎఫ్ అతిపెద్ద బలం.. కాలంతోపాటు చక్రవడ్డీ అని చెప్పాలి. ప్రారంభ సంవత్సరాల్లో వడ్డీ తక్కువగా ఉంటుంది. కానీ మొత్తం డిపాజిట్ పెరిగినా కొద్దీ వడ్డీ మొత్తం వేగంగా పెరుగుతూనే ఉంటుంది. అందుకే దీర్ఘకాలం పాటు పెట్టుబడిలో ఉండటం చాలా కీలకమని చెప్పాలి. ముందుగానే ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ కి నిరంతరం చెల్లింపులు చేసేవారు తమ రిటైర్మెంట్ నాటికి భారీ నిధిని పొందుతారు.
ఉద్యోగి జీతం పెరిగినా కొద్దీ వారి ఈపీఎఫ్ వాటా కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇది వారి రిటైర్మెంట్ నిధికి వేగంగా పెంచుకునేందుకు సహాయపడుతుంది. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా బోనసులు, ఇంక్రిమెంట్లు లేదా అదనపు ఆదాయాన్ని వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే రిటైర్మెంట్ నాటికి నిధి మరింత పెరుగుతుందని చెప్పాలి. ఈ విధమైన క్రమబద్ధమైన పెట్టుబడి దీర్ఘకాలంలో ఆర్థిక భద్రతను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
2021 బడ్జెట్ తరువాత ఈపీఎఫ్ ఫై పన్ను నిబంధనలు మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఉద్యోగి వ్యక్తిగత వాటా 2.5 లక్షలు దాటితే ఆ అదనపు మొత్తం పై వచ్చే బట్టి పన్ను పరిధిలోకి వస్తుంది. టీడీఎస్ కు లోబడి ఉంటుంది. ఈ నిబంధన ఉద్యోగి వాటాకు మాత్రమే వర్తిస్తుందని చెప్పాలి. యజమాని వాటాకు వర్తించదు. ఉద్యోగులు పరిమితంగా సమతుల్యంగా పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం ఈ విధంగా ప్రోత్సహిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈ పరిమితిని వారి కోసం 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచింది ప్రభుత్వం. కేవలం జనరల్ ఈపీఎఫ్ కు మాత్రమే క్రమ తప్పకుండా చెల్లింపు చేసే వారిపై ముఖ్యంగా ఆ చెల్లింపు నెలకు 1800రూపాయలకే పరిమితమైనప్పుడు ఈ నిబంధన ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్పాలి
నెలకు కేవలం 1800 రూపాయల పొదుపుతో దీర్ఘకాలంలో సుమారు 19లక్షలు ఎలా సృష్టించవచ్చో ఈ ఉదాహరణతో తెలుసుకున్నాం. క్రమశిక్షణ, సమయం, నిలకడతో కూడిన ఈపీఎఫ్ వంటి స్కీం పదవి విరమణ కోసం బలమైన ఆర్థిక భద్రతను కల్పిస్తుందని చెప్పాలి. అందుకే చక్రవడ్డీ పూర్తి ప్రయోజనాలు పొందడానికి పెట్టుబడులను ముందుగానే ప్రారంభించి వాటిని నిలకడగా కొనసాగించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.