
సాక్షి, హైదరాబాద్: ‘ఫ్రీ ఫైర్’.. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి ఆన్లైన్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు చితికిపోతున్నారు. వారితో పాటు కుటుంబీకులూ ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారు.
Jun 25 2026 11:48 AM | Updated on Jun 25 2026 11:48 AM
సాక్షి, హైదరాబాద్: ‘ఫ్రీ ఫైర్’.. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి ఆన్లైన్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు చితికిపోతున్నారు. వారితో పాటు కుటుంబీకులూ ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్న కొన్ని ఫిర్యాదులు పైకి కేవలం ఆర్థిక మోసాలుగా కనిపిస్తున్నప్పటికీ.. వెనుక ఈ వ్యసనం ఉంటోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే దీనికి ప్రధాన కారణమని నగర కొత్వాల్ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు.
హ్యాకింగ్ కాదు ‘సన్’ స్ట్రోక్... తన మొబైల్‌కు వరుసగా నగదు డెబిట్ మెసేజ్‌లు రావడంతో కొందరు బాధితులు ఇటీవల సైబర్ క్రైమ్ ఠాణాకు క్యూ కట్టారు. తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో వెలుగులోకి వచి్చన నిజాలు తల్లిదండ్రులను షాక్‌కు గురిచేశాయి. అక్కడ ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని, వారి పిల్లలు ఆన్లైన్ గేమింగ్‌లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి తల్లిదండ్రుల డెబిట్ కార్డు వివరాలు వాడారని తేలింది. ప్రధానంగా తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయి ఉండటంతో పిల్లలు సులభంగా రూ. వేల లావాదేవీలు చేసేశారు.
గేమ్ పరిచయంతో అక్కడకు పయనమై... ‘ఫ్రీ ఫైర్’ గేమ్ ద్వారా కొందరు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకున్న బాలికలు ఆపై సోషల్ మీడియా యాప్స్ ద్వారా వారితో చాటింగ్ కొనసాగించారు. అలా ఆన్లైన్ మాయలో పడిపోయి, కేవలం ఇంటర్నెట్లో మాత్రమే పరిచయమైన ఆ వ్యక్తులను నేరుగా కలవడానికి తమ ఇళ్లను వదిలారు. పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు పయనం కాగా... ఫిర్యాదు అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి ఆ బాలికలను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇలా రికార్డుల్లోకి ఎక్కకుండా కుటుంబాల మధ్యే ఉండిపోతున్న ‘గేమింగ్ ఉదంతాలు’ ఎన్నో ఉంటున్నాయి.
అదో స్టేటస్ సింబల్‌గా మారడంతో... ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10 నుంచి 17 ఏళ్ల విద్యార్థులు క్లాస్‌రూమ్స్ కంటే ఫ్రీ ఫైర్, మ్యాక్స్ వంటి గేమింగ్ వర్చువల్ ప్రపంచంలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఆ ఆటల్లో రేర్ ఐటమ్స్, రకరకాల ఆయుధాలు, ఎలైట్ పాస్‌లు ఉన్నవారినే స్నేహితులు హీరోలుగా చూడటం, అవి లేని వారిని తక్కువ చేసి మాట్లాడటంతో.. ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు వాటి కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఆన్లైన్ క్లాసుల పేరుతో చేతికి వచి్చన ఫోన్లు, నేడు అర్ధరాత్రి వరకు సాగే గేమింగ్ సెషన్లుగా మారిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా 2022లోనే కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీ ఫైర్’ గేమ్‌ను నిషేధించింది. సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు వీపీఎన్ ద్వారా ఆడుతున్నారు. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల్లో లభిస్తోంది.
కళ్లు తెరవండి.. పిల్లల్ని కాపాడుకోండి.. పిల్లలు వాడే ఫోన్లలో సేవ్ అయి ఉన్న బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించాలి. ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో ‘పేరెంటల్ కంట్రోల్స్’, ‘పర్చేజ్ అప్రూవల్స్’ ఆన్ చేసుకోవాలి. బ్యాంక్ అలర్ట్ మెసేజ్‌లను నిరంతరం గమనిస్తూ, అలా చేయమని పెద్దలకు చెప్పాలి. పిల్లలకు పరిమిత బ్యాలెన్స్ ఉండే ప్రీపెయిడ్ కార్డులే ఇవ్వాలి. ఆన్లైన్ ఆటలను కేవలం వినోదం కోసమే. అదీ పరిమితితోనే ఆడాలి. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు, సంరక్షకులు కూడా చిన్నారులను పర్యవేక్షించాలి. – వీసీ సజ్జనర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్
షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)
39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)
హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)
‘సూపర్ సుబ్బు’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
మద్యం మత్తులో పోలీసు చొక్కా పట్టుకుని టీడీపీ నేత వీరంగం
సిగ్గులేకుండా పందుల్లా మెక్కుతున్నారు.. పాక్ మహిళా క్రికెటర్లపై ఇంజమామ్ సీరియస్
చట్టాలపై అవగాహన లేని నువ్వు ఎంపీ అవ్వడం మా దురదృష్టం