
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gadivemula Si Nagarjuna reddy selfie video for Bigg Boss telugu 10: సాధారణంగా సమాజంలో పోలీస్ జాబ్ అంటే చాలా గౌరవంగా చూస్తారు. పోలీసులు పగలనక, రాత్రనక విధి నిర్వాహణలో ఉంటూ నిరంతరం ప్రజల కోసం డ్యూటీలు చేస్తారు. ఈ క్రమంలో కొంత మంది పోలీసు డిపార్ట్ మెంట్ గౌరవంను పెంచే పనులు చేస్తే మరికొంత మంది దీనికి భిన్నంగా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా గడివేములకు చెందిన ఒక ఎస్సై తనకు బిగ్ బాస్ హౌస్ లో వెళ్లడం ఇష్టమని, తనకు నాగార్జున ఒక చాన్స్ ఇవ్వాలని కోరుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులతో పాటు , సెలబ్రీటీలకు సైతం ఆడిషన్స్ కోసం పిలుపునిచ్చారు. అయితే ఏపీకి చెందిన ఒక ఎస్సై నాగార్జున రెడ్డి తనకు బిగ్ బాస్ లో వెళ్లడం ఆసక్తి ఉందని వీడియో రిలీజ్ చేశారు.
తనకు బిగ్ బాస్ వెళ్లడం ఇష్టమని, చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తినని చెప్పాడు. తన కుటుంబ సభ్యులు కూడా బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాలని ప్రొత్సహించినట్లు చెప్పుకొచ్చాడు. అక్కడ అన్నిరకాల టాస్క్ ల్ని ఆడే సత్తా తనకు ఉందని చెప్పాడు.అయితే యూనిఫామ్ వేసుకుని ఎస్సై నాగార్జున రెడ్డి వీడియో తీయడం ప్రస్తుతం నెట్టింట వివాదంగా మారింది.
Read more: Visakhapatnam: విశాఖ పట్నంలో పెను విషాదం.. పెళ్లైన 40 రోజులకే నవవధువు అనుమానాస్పద మృతి.. ఏం జరిగిందంటే..?
కొంత మంది యూనిఫామ్ వేసుకుని ఈ విధంగా ఎంటైర్ టైన్ మెంట్ లోకి వెళ్తానంటూ వీడియోలు తీస్తే డిపార్ట్ మెంట్ మీద గౌరవం ఏమౌతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ దీనికి రూల్స్ అంగీకరిస్తాయా..?.. పోలీసు ఉన్నతాధికారులు ఏవిధంగా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా మీద ఎస్సై నాగార్జున రెడ్డి బిగ్‌బాస్ హోస్ట్ హీరో నాగార్జున కంట్లో పడాలాని చేసిన వీడియో మాత్రం కాంట్రవర్సీగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.