
TG SSC Supplementary Results: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను పాఠశాల సంచాలకుడు నవీన్ నికోలస్ విడుదల చేశారు.
జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 17,768 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రిలీజ్ అయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ ఫలితాలను రిలీజ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారితో పాటు, మార్కులు తక్కువగా వచ్చి స్కోర్ పెంచుకోవాలనుకున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాల కోసం విద్యార్థులు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ అయిన bse.telangana.gov.in ఓపెన్ చేయండి. హోమ్‌పేజీలో అందుబాటులో ఉండే "TS 10th Advanced Supplementary Results June 2026" అనే లింక్‌పై క్లిక్ చేయండి.
అక్కడ ఓపెన్ అయ్యే కొత్త పేజీలో మీ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత 'Submit' లేదా 'Get Result' బటన్‌పై క్లిక్ చేయాలి. మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
విద్యార్థులు పైచదువులకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు విద్యాశాఖ కేవలం కొద్దిరోజుల్లోనే సమాధాన పత్రాల వాల్యుయేషన్ ని పూర్తి చేసి ఫలితాలను రెడీ చేసింది.